పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాథేశ్యామ్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ భారీ పిరియాడిక్ మూవీ ఇటీవల ఇటలీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. ప్రభాస్ సరసన క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే నటిస్తున్న ఈ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణంరాజు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. విభిన్న ప్రేమకథా చిత్రంగా రూపొందుతోన్న ఈ మూవీని వచ్చే సంవత్సరంలో సమ్మర్ కి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. పవర్ స్టార్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్. వేణుశ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. పవన్ కళ్యాణ్, శృతిహాసన్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సివుంది. అయితే.. ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తారనుకున్నారు కానీ… సంక్రాంతికి వకీల్ సాబ్ రావడం లేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే… పవన్ డేట్స్ ఇస్తే.. త్వరగా కంప్లీట్ చేసి ఉగాదికి రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. అది కుదరకపోతే సమ్మర్ కే రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు.
Also Read ;- ప్రభాస్ కొత్త సినిమా టైటిల్ అఫిషియల్ ఎనౌన్స్ మెంట్!
అదే జరిగితే… ప్రభాస్ రాధేశ్యామ్, పవన్ వకీల్ సాబ్ పోటీపడే ఛాన్స్ ఉంది. ఈ రెండు భారీ చిత్రాల మధ్య రెండు వారాలు గ్యాప్ ఉన్నప్పటికీ… అభిమానులు మాత్రం కలెక్షన్స్ విషయంలో పోటీగానే భావిస్తారు. ఇదిలా ఉంటే… ప్రభాస్ బాహుబలి, బాహుబలి 2 సినిమాలతో చరిత్ర సృష్టించడం తెలిసిందే. ఆతర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లో వెళ్లారు. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ సినిమా రావాలి… అప్పటి వరకు ఉన్న రికార్డులు బద్దలు కొట్టాలి అని పవర్ స్టార్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఇప్పుడు ఆ సమయం రాబోతుంది. అందుచేత వకీల్ సాబ్ సినిమాతో పవర్ స్టార్ స్టామినా చూపించాలని.. అభిమానులు ఎంతో ఆతృతగా ఉన్నారు. ఇక పవన్ వరుసగా సినిమాలను ఎనౌన్స్ చేస్తుండడం కూడా అభిమానులకు మరింత ఆనందాన్ని ఇస్తుంది. క్రిష్ డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీ చేస్తుండడంతో ఆ సినిమాతో చరిత్ర సృష్టిస్తామని పవర్ స్టార్ అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, క్రిష్ డైరెక్షన్ లో మూవీ, సాగర్ చంద్ర డైరెక్షన్ లో మూవీ, హరీష్ శంకర్ డైరెక్షన్ లోమూవీ, సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో మూవీ, కొరియోగ్రాపర్ జానీ డైరెక్షన్ లో మూవీ… ఇలా వరుసగా సినిమాలు చేస్తున్నారు.
అలాగే ప్రభాస్ కూడా రాథేశ్యామ్, ఆదిపురుష్, సలార్, నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో మూవీ… ఇలా వరుసగా సినిమాలు ఎనౌన్స్ చేస్తుండడంతో అటు పవన్ అభిమానులు ఇటు ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుందా..? సరికొత్త రికార్డులు సృష్టిస్తుందా ? అని ఎదురు చూస్తున్నారు. ప్రభాస్, పవన్ మధ్య పోటీ లేకపోయినా… అభిమానులు మాత్రం బాక్సాఫీస్ నే షేక్ చేసేది మా హీరో అంటే మా హీరోనే అంటూ పోటీపడుతున్నారు. మరి…ఈసారి బాక్సాఫీస్ ని ఎవరు షేక్ చేస్తారో..? ఎవరు రికార్డులు సృష్టిస్తారో చూడాలి.
Must Read ;- మరో సినిమా అనౌన్స్ చేయనున్న ప్రభాస్.. కన్ ఫ్యూజన్ లో ఫ్యాన్స్.











