జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటుంది. ఈక్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శల దాడి జోరుగా కొనసాగుతోంది. ఈ దాడులు నేతల మధ్య నేరుగానే కాకుండా సోషల్ మీడియా వేదికగా కూడా కొనసాగుతున్నాయి. నేతల మధ్య విమర్శలు సాధారణ విషయమే కానీ ఎన్నికలు జరుగుతుండటంతో విమర్శలు గుప్పించడంలో ఏ ఒక్క పార్టీ నేత కూడా అస్సలు తగ్గటంలేదు. అయితే తాజాగా సీఎం కేసీఆర్, ఐటీ, సమాచారశాఖ మంత్రి కేటీఆర్‌పై మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శల దాడి చేస్తూ ఎద్దేశా చేశారు.
Public toilets in Hyderabad have become Publicity toilets.
KCR KTR using them.
Will Public also use them? pic.twitter.com/v8ySDyC63f— Konda Vishweshwar Reddy (@KVishReddy) November 18, 2020
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఆయా పార్టీలకు సంబంధించిన ప్రచార ఫ్లెక్సీలు, ప్రకటనలు లేకుండా ఎన్నికల అధికారులు ప్రత్యేక సిబ్బందిని నియమించి వాటిని తీసేస్తున్నారు. అయితే నగరంలో కొన్ని చోట్ల ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రచార ఫ్లెక్సీలను ట్విట్టర్లో కొండా పోస్ట్ చేశారు. రూ.5 అన్నపూర్ణ పథకం, కళ్యాణ లక్ష్మీ-షాదీ ముబారక్ పథకం, టీఎస్-బీపాస్ పథకానికి సంబంధించి ఉన్న ప్రచార ఫ్లెక్సీలను పబ్లిక్ టాయిలెట్ల వద్ద ఉన్న ఫోటోలను ఆయన పోస్ట్ చేశారు.
ఈ ఫోటోలను పోస్ట్ చేయడంతోపాటు పబ్లిక్ టాయిలెట్లకు లింకుపెడుతూ సీఎం కేసీఆర్, కేటీఆర్‌పై వ్యాఖ్యలు చేస్తూ సెటైర్లు విసిరారు. ఇవి పబ్లిక్ టాయిలెట్స్ కాదని, పబ్లిసిటీ టాయిలెట్స్ అని ఎద్దేవా చేశారు. ఆ టాయిలెట్లను పబ్లిక్‌తో పాటు కేసీఆర్, కేటీఆర్ కూడా వాడుతున్నారంటూ సెటైర్లు వేశారు. పబ్లిక్ టాయిలెట్స్‌ను కూడా ప్రభుత్వం ఎన్నికల ప్రచారానికి ఇలా వాడుసుకుంటుందని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ట్విట్టర్ వేదికగా ఇలా విమర్శించారు.
Must Read ;-కేటీఆర్ ఆ కామెంట్స్ వెనుకాల ఆంతర్యమిదేనా?