తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించారు. త్వరలో 50వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు. గురువారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. ఉద్యోగాలపై ప్రకటన చేశారు. రాష్ట్రంలో వెనువెంటనే 50వేల ఖాళీలు భర్తీ చేసేలా సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారని.. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో విడుదల చేస్తామని ఆర్థికమంత్రి హరీశ్ రావు అన్నారు.
అంతకుముందు ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బిల్లు, మాజీ ప్రజాప్రతినిధుల పెన్షన్ పెంపు బిల్లులకు శాసన సభ ఆమోదం తెలిపింది. కనీస పెన్షన్ రూ. 50 వేలు కాగా, గరిష్ట పెన్షన్ రూ.70 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకంది. ఒకటి, రెండు, మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేల గతంలో పెన్షన్ రూ.30వేలు కాగా, దాన్ని రూ.50వేలకు పెంచారు. మూడు సార్లు అంతకుమించి గెలిచిన సభ్యుల పెన్షన్‌ను రూ. 50వేల నుంచి 70వేలకు పెంచారు.
Also Read :కేంద్రానికి మంత్రి హరీశ్ చేసిన డిమాండేంటీ !