విద్యార్ధులకు ఉపకార వేతనాలను నిలిపివేస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 77ను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన వారిపై అత్యాచార కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టిన సందర్భంలో జడ్జి కూడా విస్తుపోయిన సంగతి తెలిసిందే. దీనిపై మీడియాలో పలు కధనాలు కూడా ప్రసారమవడంతో.. తమ తప్పును కవర్ చేసుకునే పనిలో పడ్డారు ఏపీ పోలీసులు. ఈ విషయానికి సంబంధించి గుంటూరు అర్బన్ ఎస్పి అమ్మి రెడ్డి తన ట్విట్టర్ ఖాతా ద్వారా వివరణ ఇచ్చారు.
ఈ కేసు రిమాండ్ రిపోర్ట్ టైపు చేసినపుడు వేరే కేసుకు సంబంధించిన మేటర్ ఈ కేసుకు పొరపాటున అటాచ్ అవడం వలన ఈ అపార్ధం తలెత్తింది.@APPOLICE100 @FactCheckIndia @dgpapofficial
— GUNTUR DISTRICT POLICE (@police_guntur) January 23, 2021
పొరపాటున అలా అయింది!
మీడియాలో పోలీసుల తీరుపై కధనాలు రావడంతో నాలుక్కరుచుకున్న గుంటూరు అర్బన్ ఎస్పి తన ట్విట్టర్‌లో పొరపాటు జరిగినట్టు ఒప్పుకున్నారు. ‘సి.ఎం. గారి ఇల్లు ముట్టడికి పిలుపు ఇచ్చిన TNSF విద్యార్థి నేతలపై తాడేపల్లి పోలీసులు అత్యాచార యత్నం కేసు పెట్టినారని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలలో నిజం లేదు. ఈ కేసుకు సంబంధించిన FIR లో అత్యాచార యత్నం అనే సెక్షన్లు ఏమియును లేవు. ఈ కేసు రిమాండ్ రిపోర్ట్ టైపు చేసినపుడు వేరే కేసుకు సంబంధించిన మేటర్ ఈ కేసుకు పొరపాటున అటాచ్ అవడం వలన ఈ అపార్ధం తలెత్తింది.’
Must Read ;- మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయాన్ని దిగ్బంధించిన పోలీసులు











