బ్యాలెట్ పేపర్‌పై స్వస్తిక్ గుర్తుతో పాటు పెన్నుతో గీసినా ఓటు చెల్లుతోందని రాష్ట్ర ఎన్నికల సంఘం నిన్న అర్థరాత్రి జారీ చేసిన సర్కులర్‌ను బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టు మెట్లు ఎక్కింది. అయితే ఈ అంశంపై విచారణ చేపట్టిన కోర్టు ఓట్ల లెక్కింపులో స్పష్టత ఇచ్చింది. ఎన్నికల కమిషన్ జారీ చేసిన సర్కులర్‌ను హైకోర్టు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో కౌంటింగ్ ప్రక్రియలో మార్పు చోటు చేసుకుంది. ఈసీ సర్కులర్‌ను కోర్టు తప్పుబట్టింది. ఎన్నికలు రాజ్యాంగాన్ని లోబడే జరగాలని పేర్కొన్నది. స్వస్తిక్ గుర్తులు ఉన్న ఓట్లనే లెక్కించాలని తెలిపింది. వేరే గుర్తులున్న వాటిని ఎలా పరిగణలోకి తీసుకుంటారని ప్రశ్నించింది. కేవలంలో స్వస్తిక్ గుర్తు ఉన్న ఓట్లనే లెక్కించాలని హైకోర్టు స్పష్టం చేయడంతో రాష్ట్ర ఎన్నికల సంఘానికి షాక్ తగినట్లయింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తూ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిసన్ ను హైకోర్టు తెలిపింది.
గ్రేటర్ ఎన్నికలు డిసెంబర్ 1వ తేదీన జరిగాయి. దాదాపు 18 ఏళ్ల తరువాత జీహెచ్ఎంసీ ఎన్నికలు బ్యాలెట్ పేపర్లతో జరిగాయి. ఈ ఎన్నికల్లో స్వస్తిక్ గుర్తును వినియోగిస్తారు. అభ్యర్థి గుర్తుపై స్వస్తిక్ గుర్తుతో పాటు పెన్నుతో గీసినా ఓటు వేసినట్లేనని నిన్న రాత్రి సర్కులర్‌ను ఎస్ఈసీ విడుదల చేసింది. ఈసర్కులర్‌పై అభ్యంతరం తెలుపుతూ బీజేపీ న్యాయస్థానం మెట్లు ఎక్కింది. దీంతో ఈసీ సర్కులర్‌ను హైకోర్టు సస్పెండ్ చేస్తూ స్వస్తిక్ గుర్తు ఉన్న ఓట్లనే లెక్కించాలని సూచించింది. వెంటనే కౌంటింగ్ కేంద్రాలకు సమాచారం అందించాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్‌లలో 74 డివిజన్లలో బీజేపీ, టీఆర్ఎస్ 35, ఎంఐఎం 10, మూడు డివిజన్లలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసిన వెంటనే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పోలయ్యాయనేది వెల్లడించాల్సి ఉంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మరికాసేపట్లలో తొలి రౌండ్ ఫలితాలు వెలువడనున్నాయి.
Must Read ;- బీజేపీ 50.. టీఆర్ఎస్ 30 డివిజన్లలో ఆధిక్యం!