తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న రియాల్టీ షో బిగ్ బాస్. స్టార్ మా టీవీలో ప్రసారం అయిన బిగ్ బాస్ 1, బిగ్ బాస్ 2, బిగ్ బాస్ 3… ఒక సీజన్ కు మించి మరో సీజన్ సక్సెస్ సాధించడంతో బిగ్ బాస్ 4 పై మరింత ఆసక్తి ఏర్పడింది. అయితే.. కరోనా టైమ్ లో ఈ షో స్టార్ట్ కావడంతో షో ఎలా ఉంటుందో..? ఎవరెవరు ఈ షోలో పాల్గొంటారో అనే క్యూరియాసిటీని అందరిలో కలిగించింది. అయితే.. ఈ షో స్టార్ట్ అయినప్పుడు షోలో అందరికీ తెలిసినవాళ్లు.. లేరు అందువల్ల ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టం అనుకున్నారు.
అయితే.. ఊహించని విధంగా రోజురోజుకు ఈ షో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేస్తుంది. బిగ్ బాస్ 4 విన్నర్ ఎవరో తెలిసే టైమ్ దగ్గరపడుతున్న కొద్దీ మరింత ఆసక్తి కలిగిస్తుంది. ఇదిలా ఉంటే… ఈ షో నుంచి బయటకు వచ్చిన సింగర్ నోయల్ బిగ్ బాస్ కి షాక్ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ.. నోయల్ ఏం చేసాడు..? బిగ్ బాస్ ఎందుకు షాక్ అయ్యాడు అనుకుంటున్నారా..? విషయం ఏంటంటే.. బిగ్ బాస్ షో నోయల్ లో చాలా మార్పు తీసుకువచ్చింది. ఇంకా చెప్పాలంటే.. ఈ బిగ్ బాస్ షో వలన వైరాగ్యం వచ్చినట్టు అనిపిస్తుంది.
ఇటీవల నోయల్ సిటీకి దూరంగా.. రాష్ట్ర సరిహద్దులో ఉన్న తన ఇంటికి మకాం మార్చేంతగా మార్పు వచ్చిందట. ఇదంతా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్ వ్యూలో బయటపెట్టాడు. ఇంకా ఏం చెప్పాడంటే.. మనకు ఇష్టమైన వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే.. అంత మంచిది అన్నాడు. ఇష్టమైన వాళ్లకు దగ్గరగా ఉంటే.. సమస్యలు వస్తాయన్నాడు. అందుకనే సిటీకి దూరంగా ఇల్లు కట్టుకున్నాను అని చెప్పాడు. ఇక బిగ్ బాస్ షో గురించి మాట్లాడుతూ.. ఈ షో మనకు అవసరం లేదన్నాడు. అసలు ఈ షోకు తనకు ఎందుకు వెళ్లానో అని బాధపడుతున్నాని చెప్పాడు.
అందుకనే బిగ్ బాస్ షోను చూడడం మానేసానని చెప్పి షాక్ ఇచ్చాడు. హారిక నిజ జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఇక్కడి వరకు వచ్చింది. ఈసారైనా అమ్మాయిని గెలిపించాలి అంటూ తన మనసులో మాటలను బయటపెట్టాడు. ఈవిధంగా నోయల్ బిగ్ బాస్ కి షాక్ ఇచ్చి వార్తల్లో నిలిచాడు. మరి.. నోయల్ కోరుకుంటున్నట్టుగా ఈసారైనా బిగ్ బాస్ విన్నర్ టైటిల్ ను అమ్మాయి గెలుచుకుంటుందేమో చూడాలి.
Must Read ;- వంటలక్క వర్సెస్ బిగ్ బాస్