Jagan Government Denigrating The Sentiments Of Hindus :
గత సంవత్సరం నిర్వహణ కష్టంగా మారిందనే సాకుతో ఇతర రాష్ట్రాలలో ఉన్న కోట్ల విలువైన టిటిడి ఆస్తులను అమ్మకానికి పెట్టి, వచ్చిన ఆదాయంతో పరిపాలన చేయాలని భావించారు జగన్. కానీ తిరుమల శ్రీవారికి భక్తులు కానుకగా ఇచ్చిన ఆస్తుల అమ్మకం అనే ప్రక్రియని భక్తులు జీర్ణించుకోలేకపోయారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆనాడు హిందూ ధార్మిక సంస్థలు, పీఠాధిపతులు యావత్ హైందవ సమాజం తీవ్రంగా వ్యతిరేకించగా కాస్త వెనక్కి తగ్గారు జగన్.
డిక్లరేషన్ ఇవ్వలేదుగా
అటు తరువాత నవరాత్రుల సందర్బంగా తిరుమలలో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి వారికి సంప్రదాయ ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి సతీసమేతంగా వస్త్రాలు సమర్పించాలి. అలాగే ఇతర మతాలకు చెందిన వారు స్వామి వారిని దర్శించుకొనేముందు స్వామి వారిని అంగీకరిస్తూ.. హిందు మత విశ్వాసాలను నమ్ముతూ డిక్లరేషన్ చేసి స్వామి వారిని దర్శించుకోవాలి. కానీ జగ్మోహన్ రెడ్డి మాత్రం సతీ సమేతంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించకుండా.. ఒక్కరే పట్టు వస్త్రాలు సమర్పించి హిందూ ఆచార సంప్రదాయాలను కించపరిచారని, అలాగే స్వామి వారి దర్శనానికి వెళ్లే ముందు డిక్లరేషన్ పై సంతకం పెట్టకుండా తిరుమల నిబంధనలకు వ్యతిరేకంగా స్వామి వారి దర్శనం చేసుకోవడం ఆరోజుల్లో పెద్ద దుమారమే లేపింది. సరే ముఖ్యమంత్రి హోదాలో వెళ్లారు కాబట్టి డిక్లరేషన్ అవసరం లేదని టీటీడీ అధికారులు చెప్పినా, సతీసమేతంగా పట్టువస్త్రాలు ఇవ్వకపోవడం, భుజం మీద ఉత్తరీయం తప్పుగా వేసుకుని తిరగడం మాత్రం భక్తులు జీర్ణించుకోలేకపోయారు.
ఆలయాలపై దాడులపైనా అంతే
అది పక్కన పెడితే, జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన మొదటి 18 నెలల్లో దాదాపు 600 పైగా హిందూ దేవాలయాల మీద దాడులు జరిగి దేవుళ్ళ విగ్రహాలు ధ్వంసం అయ్యాయి. ముఖ్యంగా అంతర్వేది రథం దగ్ధం సంఘటన, రామతీర్థం లో రాముని తల నరికిన సంఘటనలతో హిందువుల మనోభావాలు గాయపడ్డాయి. కానీ ఇంతవరకు ఒక్క నిందితుడిని కూడా జగన్ ప్రభుత్వం ప్రజలముందు నిలబెట్టలేదు. ఈ ఘటనలపై పెద్ద ఎత్తున నిరసనలు జరిగినా.. జగన్ సర్కారు పట్టించుకున్న పాపాన పోలేదు. అంతేకాకుండా ఎవరో పిచ్చోళ్లు చేసిన ఘటనలుగా వాటిని అభివర్ణించి తనదైన శైలి మూర్ఖత్వాన్ని బయటపెట్టుకున్నారు.
హిందు పండుగ నిషేధం
ఇప్పుడు సరికొత్తగా మరోవివాదం పుట్టిస్తూ, ప్రక్క రాష్ట్రాలు కోవిడ్ నిబంధనలతో వినాయక చవితి జరుపుకోవాలని అనుమతి ఇస్తే జగన్ మాత్రం ఏపీ లో వినాయకచవితి నిషేధం చేశాడు. ఈ నిర్ణయంతో హిందూ బంధువుల మనోభావాలు గాయపడ్డాయి. కాగా టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వినాయక చవితి ప్రజలంతా ఐకమత్యంతో జరుపుకునేలా అనుమతులు ఇవ్వాలి అంటూ జగకు బహిరంగ లేఖ రాసారు. టీడీపీ నేత బోండా ఉమా తప్పకుండా పండుగ జరుపుకుంటాం. ఏమి చేసుకుంటారో చేసుకోండి అంటూ మీడియా సమావేశంలో చెప్పారు. కాగా ఇప్పటికే వినాయక చవితి పండుగ నిషేధం పై హిందూ ధార్మిక సంస్థలు నిరసనలు చేపట్టగా…ఇప్పటివరకు హిందూ మతం పట్ల , హిందూ ధర్మం పట్ల జగన్ అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలపై యావత్ హైందవ సమాజం ధర్మాగ్రహం వ్యక్తం చేస్తోందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
Must Read ;- లోకేశ్ దెబ్బకు జగన్ దిగిరావాల్సిందే











