78 ఏళ్ల జో బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా చరిత్రలో తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా భారతీయ సంతతికి చెందిన 56 ఏళ్ల కమలా హారిస్ ప్రమాణం చేశారు. అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని, తాను అందరి వాడుగా ఉంటానని జో బైడెన్ ఈ సందర్భంగా ప్రసంగించారు. అమెరికా చరిత్రలోనే మునుపెన్నడూ లేనంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య అధ్యక్షుని పదవీ స్వీకార ప్రమాణం జరిగింది.
చివరి నిర్ణయంలోనూ ట్రంప్ టెంపర్
అమెరికా 45వ అధ్యక్షుడు ట్రంప్ పదవి చివరిరోజు వైట్ హౌస్ ను వీడారు. తన సతీమణి మొలానియాతో కలసి తన సొంత రాష్ట్రమైన ఫ్లొరిడాకు వెళ్లారు. 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకాకుండానే ఆయన వెళ్లిపోవడం అమెరికన్లకు ఆశ్చర్యానికి గురిచేసినా.. ట్రంప్ తీసుకున్న అనేక ఆశ్చర్యకరమైన నిర్ణయాల్లో ఇదీ ఒకటనే కామెంట్లు వచ్చాయి. ఇక ట్రంప్ తన భార్య, రెండో భార్య కుమార్తెతో కలసి చివరి సారిగా అధికారిక ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఎక్కి మెరీల్యాండ్ కు వెళ్లారు. అక్కడినుంచి ఫ్లోరిడాలోని పామ్ బీచ్ సమీపంలో తమ మార్ లాగో రిసార్టుకు వెళ్లారు. ఇక బైడెన్ ప్రమాణ స్వీకారానికి హాజరుకాకపోవడం ఒక నిర్ణయం కాగా చివరిరోజు వైట్ హస్ మాజీ ఉన్నతాధికారి స్టీవ్ బ్యానన్ తో సహా 73మంది క్షమాభిక్ష, మరో 70మందికి శిక్షను తగ్గిస్తూ ఆర్డర్లు ఇచ్చారు. గతంలోనూ తాను అమెరికన్లకోసం పోరాడానని, రానున్న కాలంలోనూ అదే చేస్తానని అధ్యక్ష హోదాలో చివరిసారిగా ప్రసంగిస్తూ వ్యాఖ్యలు చేశారు. బైడెన్ బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
Also Read ;- ట్రంప్ నోటికి తాళం వెనుక.. తెలుగు అమ్మాయి విజయ గద్దె
కుమార్తె నిశ్చితార్ధం..
అటు ట్రంప్ అధ్యక్ష భవనాన్ని వీడాల్సిన నాడే.. ఆయన చిన్నకమార్తె టిఫెనీ ట్రంప్ ఎంగేజ్‌మెంట్ జరిగింది. లెబనాన్ లో పుట్టి, లండన్ లో సెటిలైన వ్యాపారవేత్త మైఖేల్ బౌలోస్ తో నిశ్చితార్థం జరిగింది. బౌలోస్ తో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు టిఫెనీ ట్రంప్. నిశ్చితార్థం జరుగుతున్న సమయంలో ట్రంప్ కొంత భావోద్వేగానికి గురైనట్లు సమాచారం. ట్రంప్ రెండవ భార్య మార్లా మాపుల్స్ కుమార్తె అయిన టిఫెనీ ట్రంప్ న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.
కీలక నిర్ణయాలు ఇవేనా..
బైడెన్ పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి బ్రేక్ పడుతుందని అంచనావేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థలో మళ్లీ అమెరికా చేరుతుందని కూడా ప్రచారం జరుగుతోంది. వీటితోపాటు కొన్ని ఇస్లామిక్ దేశాలనుంచి వచ్చేవారికి కొన్ని విషయాల్లో నిషేధాన్ని ఎత్తేస్తున్నట్లు ప్రకటించే అవకాశం ఉంది. పారిస్ పర్యావరణ ఒప్పందాన్ని పునరుద్దరించడం, కొవిడ్ నియంత్రణకు మాస్క్ లు తప్పనిసరి చేసేలా నిర్ణయం, విద్యారుణాల వడ్డీ మినహాయింపు, లైబీరియన్ల పై ఆంక్షల విషయంలో వెసులుబాటు లాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Must Read ;- భారతీయ అమెరికన్లకు కీలక పదవులు.. వైట్ హౌస్‌లో మనవాళ్లే 17మంది











