బాక్సైట్‌రెడ్డి తనకు దేవుడిచ్చిన అన్నయ్య గాలి జనార్దన్‌రెడ్డిని మించిపోతున్నాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. సీఎం జగన్ తన బంధువులైన వైవీ విక్రాంత్‌రెడ్డి, వైఎస్ అనిల్‌రెడ్డిలతో మైనింగ్ మాఫియా పనులు చేయిస్తున్నారని లోకేష్ ఆరోపించారు. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దుల్లో ఉన్న అభయారణ్యంలో జగన్ బంధువులు లేటరైట్ ముసుగులో బాక్సెట్ తవ్వకాలు చేపడుతున్నారని ఆరోపించారు. ఇది రూ.15 వేల కోట్ల బాక్సైట్ కుంభకోణమని లోకేష్ వెల్లడించారు.
టీడీపీ నేతలను నిర్బంధించిన పోలీసులు
విశాఖ మన్యం ప్రాంతంలో లేటరైట్ తవ్వకాలను పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ నాయకులను పోలీసులు నిర్బంధించారని లోకేశ్ పేర్కొన్నారు. పోలీసుల నిర్బంధంలో ఉన్న టీడీపీ నాయకులతో తాను ఫోన్‌లో మాట్లాడానని, వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసేంతవరకు పోరాడాలని వారికి సూచించనట్లు లోకేశ్ వివరించారు. అభయారణ్యాన్ని ధ్వంసం చేసి పర్యావరణానికి హాని కలిగిస్తూ, గిరిజనుల హక్కులను కాలరాస్తూ చెలరేగిపోతున్న వైసీపీ మైనింగ్ మాఫియాను తరిమికొట్టేంత వరకు టీడీపీ పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు.
గిరిజన సోదరులతో కలిసి తిరగబడతాం : అచ్చెన్నాయుడు
లేటరైట్ తవ్వకాలపై ప్రభుత్వం వెనక్కు తగ్గకపోతే గిరిజన సోదరులతో కలిసి ప్రభుత్వంపై తిరగబడతామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. లేటరైట్ తవ్వకాల పరిశీలనకు వెళ్లిన టీడీపీ బృందాన్ని పోలీసులు అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నట్లు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. లేటరైట్ తవ్వకాలు నిలిపే వరకు టీడీపీ పోరాటం చేస్తుందని అచ్చెన్న తెలిపారు. ఓబుళాపురం మైన్స్ దోచుకోవడంతో మైనింగ్ మాఫియా కింగ్‌గా జగన్‌రెడ్డి ఎదిగారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
అవినీతి పాలనకు మైనింగ్ మాఫియా నిదర్శనం: కొల్లు రవీంద్ర
రాష్ట్రంలో మైనింగ్ మాఫియాకు సీఎం సోదరులు తెరలేపారని టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. పరిశీలనకు వెళ్లిన టీడీపీ బృందాన్ని అరెస్ట్ చేయడం దారుణమన్నారు. జగన్ అవినీతి పాలనకు మైనింగ్ మాఫియా నిదర్శనమన్నారు. బాక్సైట్ తవ్వకాలకు సీఎం సోదరులు సిద్ధమవుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అభయారణ్యంలో రోడ్డు వేసేందుకు అనుమతి ఎవరిచ్చారన్నారు. దీనిపై న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
Must Read ;- 15 ఏళ్లు, రూ.15 వేల కోట్లు!.. వైవీ రెడ్డి నయా దందా!
మైనింగ్ డాన్ @ysjagan గారూ! బంధువుల్ని రాబందుల్లా మన్యంపైకి వదిలి వేడుక చూస్తున్నారా? మీ ఫ్యామిలీ ప్యాక్ మైనింగ్ మాఫియా దురాగతాలు బయటపడకూడదనేనా ప్రతిపక్ష నేతల్ని అక్రమంగా అరెస్ట్ చేయించారు?(1/3) pic.twitter.com/ByAOSxPFPD
— Lokesh Nara (@naralokesh) July 9, 2021
అనిల్‌రెడ్డి మైనింగ్ మాఫియా కార్యకలాపాలు టిడిపి బయటపెట్టింది. ఆ అక్కసుతో సీనియర్ టిడిపి నేతల్ని అక్రమంగా అరెస్టు చేయించడం దుర్మార్గం. తక్షణమే వారిని విడుదల చేయాలి. బాక్సైట్ మైనింగ్ ఆపాలి. పర్యావరణాన్ని పరిరక్షించాలి. గిరిజనుల హక్కులు కాపాడాలి.(3/3) pic.twitter.com/nqU1b6hQXS
— Lokesh Nara (@naralokesh) July 9, 2021











