కేజీఎఫ్ సినిమాతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు మారుమ్రోగింది. దానికి కారణం.. కేజీఎఫ్ సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడమే. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 ఎనౌన్స్ చేయడంతో ఎప్పుడెప్పుడు కేజీఎఫ్ 2 వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన కేజీఎఫ్ 2 టీజర్ యూట్యూబ్ ని షేక్ చేసింది. ఇదిలా ఉంటే.. ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడానికి టాలీవుడ్ స్టార్ హీరోలు రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్రస్ట్ చూపించారు.
ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో మూవీ ఫిక్స్ అని.. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్నట్టు వార్తలు వచ్చాయి. అలాగే మహేష్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మూవీ కూడా ఫిక్స్ అంటూ గట్టిగా వినిపించింది. అయితే.. ఎన్టీఆర్, మహేష్ బాబుతో కాకుండా ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సినిమాని ఎనౌన్స్ చేసి షాక్ ఇచ్చారని చెప్పచ్చు. ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ సలార్ మూవీ చేస్తున్నారు.
దాంతో ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా ఉందా.? లేదా.? ఉంటే.. ఎప్పుడు ఉంటుంది.? అనేది ఆసక్తిగా మారింది. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అయిననూ పోయిరావలే హస్తినకు అనే సినిమా చేయనున్నారు. ఈ రెండు సినిమాలు కంప్లీట్ చేసే సరికి ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ మూవీ కంప్లీట్ చేస్తారు. ఆతర్వాత ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ మూవీ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్ లో మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుందని సమాచారం.
Must Read ;- ‘సలార్, కేజీఎఫ్’ రెండింటికీ పోలిక ఉందా.?