ఆయన వంశస్తులు ఆయనకే అప్పచెప్పారు. ఆ ప్రాంతంలోని ప్రజలు ఆయనకు గౌరవమిచ్చారు. న్యాయస్థానం ఆయన హక్కును కాపాడింది. కాని ప్రభుత్వం ఆయనను గుర్తించడానికి నిరాకరిస్తోంది. తన అధికారుల ద్వారా అవమానాలు చేయాలని చూస్తోంది. ప్రోటోకాల్ పాటించాల్సిన అధికారులు రాజకీయం చూపిస్తున్నారు. ధర్మంగా దానం చేసిన వారికి… అధర్మం చూపిస్తున్నారు. న్యాయంగా హోదా దక్కించుకుంటే..అన్యాయం చేయాలని చూస్తున్నారు.
గజపతిరాజుల వారసుడిగా..
అశోక్ గజపతిరాజు.. ఆయన ప్రజలకు రాజకీయ నేతగా, మంత్రిగా ఎంత సేవలు చేశారనేది వేరే విషయం. కాని గజపతిరాజుల వారసుడిగా ఆయన ఆ ప్రాంతానికి సేవ చేశారు..చేస్తున్నారు. హైకోర్టు ఆయన నియామకాన్నిపునరుద్ధరించినా… ఈవోలు సైతం ఆయనకు గౌరవం ఇవ్వటానికి నిరాకరిస్తున్నారంటే… రాష్ట్రంలో అరాచకం ఏ స్థాయిలో రాజ్యమేలుతోందో అర్ధం చేసుకోవచ్చు. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే…అశోకగజపతిరాజు మళ్లీ తిరిగి రాగానే మాన్సాస్ ట్రస్టులో అక్రమాలు జరుగుతున్నాయని గుర్తొచ్చింది. అది కూడా దేవాదాయశాఖ మంత్రికో.. లేక మొన్నటి దాకా ఛైర్ పర్సన్‌గా ఉన్న సంచయితకో కాదు.. ఏ సంబంధమూ లేని ఎంపీ విజయసాయిరెడ్డికి. ఆయనే అధికారికంగా ప్రకటన చేశారు.. విచారణ జరిపిస్తారంట..ఆయన అంతా చెప్పాక..మంత్రి వెల్లంపల్లి అవునవును అంటూ ఊ కొట్టారు. అదీ పరిస్దితి.
గజపతిరాజుల ఆస్తులను కొల్లగొట్టడానికి..
అంటే గజపతిరాజుల ఆస్తులను కొల్లగొట్టడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే అశోకగజపతిరాజును తొలగించి అర్ధరాత్రి జీవోలు ఇచ్చి హడావుడిగా సంచయితను తీసుకొచ్చి ఆయన స్థానంలో కూర్చోబెట్టారు. అప్పటి నుంచి మాన్సాస్ ట్రస్టు కింద.. సింహాచలం దేవస్థానం కింద ఉన్న భూములను చేజిక్కించుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. అశోక్ గజపతిరాజు కోర్టుకెళ్లారు కాబట్టి.. వారి ప్రయత్నాలకు కాస్త బ్రేక్ పడింది.
సంచయిత ఛైర్ పర్సన్‌గా ఉన్న సమయంలో జరిగిన వాటిపై..
ఇప్పుడు హైకోర్టు అశోకగజపతిరాజును మళ్లీ అదే స్థానంలో కూర్చోబెట్టగానే… ట్రస్టులో అక్రమాలు..ఆస్తుల్లో అవకతవకలు అన్నీ అర్జెంటుగా ముందుకొచ్చేశాయి. వాటిపై విచారణ పేరుతో అశోకగజపతిరాజుపై బురద జల్లి.. మళ్లీ ఆయనను ఎలా అయినా తప్పించాలనేదే వారి ఆలోచన. అసలు సంచయిత ఛైర్ పర్సన్‌గా ఉన్న సమయమంతా ఏ అక్రమాలు జరిగాయో విచారణ జరిపితే.. చాలా బయటపడతాయనే కామెంట్లు వినపడుతున్నాయి. సింహాచలం భూములను వేలం పాట వేయాలని అసలు ఎవరు ప్రతిపాదించారు..ఎవరు నిర్ణయించారో బయటపెడితే..వారి సంగతి చూడొచ్చు. మాన్సాస్ కింద ఉన్న కాలేజీ గ్రౌండ్‌ను కార్పొరేట్ కంపెనీకి అప్పచెప్పాలనుకున్నదెవరో.. ఏ కంపెనీకి ఇవ్వాలనుకున్నారో.. ఎలా ఇవ్వాలనుకున్నారో.. బయటపెడితే వారి సంగతి కూడా చూడొచ్చు. అంతే కాదు.. రామతీర్ధంలో రాముడి విగ్రహం తల నరికినవారెవరో పట్టుకోగలిగితే ఇంకా బాగుంటుంది. అంతే కాని.. ఆ పేరుతో అశోకగజపతిరాజును ఇష్టమొచ్చినట్లు మాట్లాడి.. ఆయనను రామతీర్ధం ట్రస్టు ఛైర్మన్ పదవి నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఏ స్వామిజీ సూచనలు ఫాలో అవుతున్నాడో బయటపెడితే.. అప్పుడు చూడొచ్చు. ఇవన్నీ వదిలిపెట్టి.. ఎంతసేపు వాళ్లను తొలగించి మనం వెళ్లిపోవాలి..అర్జెంటుగా ఆస్తులను కొట్టేయాలన్న ఆత్రంలో తప్పులు చేస్తూ పోతున్నారు.
Must Read ;- డామిట్ ! కథ అడ్డం తిరిగింది.. వైసీపీ అర్ధరాత్రి యాక్షన్ ప్లాన్‌కు బ్రేక్