మార్వెల్ ప్రపంచంలో లోకి ప్రత్యేకత ఏమిటో ఆ సిరీస్ ను అభిమానించే అందరికీ తెలుసు. ఈ లోకీని మళ్లీ కలుసుకునే సమయం వచ్చేసింది. డిస్నీప్లస్ హాట్ స్టార్ లో లోకి వీక్షించే సమయం అతి త్వరలోనే ఉంది. ‘ది ఫాల్కన్ అండ్ ది వింటర్ సోల్జర్’ వెబ్ సిరీస్ గురించి ఇటీవలే డిస్నీప్లస్ హాట్ స్టార్ ప్రకటించింది. ఇండియాలో నాలుగు భాషల్లో దీన్ని స్ట్రీమింగ్ చేయనున్నారు. ఆ తర్వాత గాడ్ ఆఫ్ మిస్ఛీఫ్ ను విడుదల చేస్తారు. ఇదే లోకి సిరీస్. దీన్ని ఇంగ్లీషుతోపాటు హిందీ, తమిళం, తెలుగులో విడుదల చేయబోతున్నారు.
ఇతర పోటీ ఓటీటీ సంస్థలకు కూడా ఇది ఆశ్చర్యం కలిగించే విషయమే. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ లాంటి సంస్థల పోటీని ఎదుర్కోవాలంటే మార్వెల్ సిరీస్ ఒక్కటే మార్గమని డిస్నీప్లస్ భావిస్తోంది. లోకి లాంటి సూపర్ హీరోకి సంబంధించిన 6 ఎపిసోడ్స్ ను ప్రాంతీయ భాషల్లో డబ్బింగ్ చేయడం విశేషమే. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ‘లోకి’ అనేది నాలుగో దశలోని మూడో పెద్ద ప్రాజెక్టు అవుతుంది. ముఖ్యంగా లోకి అనేవాడు విలన్. విలన్ అయినా అతనికీ అభిమానులెక్కువే. ఈ సిరీస్ కు సంబంధించి ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. దీనికి విశేషమైన స్పందన లభిస్తోంది.
ది ఎవెంజర్స్ ఎండ్ గేమ్ ఎక్కడ ముగుస్తుందో ఈ సిరీస్ అక్కడ ప్రారంభమవుతుంది. లోకి కాలంలోకి చేసే ప్రయాణంలో కెప్టెన్ స్టీవ్ రోజర్స్ ను కలుస్తాడా లేడా అన్నది ఈ సిరీస్ చూసి తెలుసుకోవలసిందే. ఈ ఏడాది జూన్ 11నుంచి ఈ ‘లోకి’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది. మార్వెల్ అభిమానులు ఆ రోజు కోసం ఎదురుచూడక తప్పదు. ఓటీటీ ప్రపంచంలో పోటీ తీవ్రంగా ఉన్న ఈ సమయంలో డిస్నీప్లస్ మార్వెల్ తో ఇలాంటి ఒప్పందం చేసుకోవడం వల్ల పోటీ తట్టుకుని ముందుకు వెళ్లడానికి ఉపయోగపడుతుంది.
Must Read ;- ‘రామ్ సేతు’ నిర్మిస్తున్న అమెజాన్ ప్రైమ్











