సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు. పరశురామ్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ మూవీ జనవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే.. ఈ సినిమా తర్వాత మహేష్ ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది ఆసక్తిగా మారింది. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి మహేష్ తో సినిమా చేయనున్నట్టు ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్ వ్యూలో చెప్పారు. అయితే.. మహేష్ మాత్రం ‘సర్కారు వారి పాట’ తర్వాత రాజమౌళితో కాకుండా మరో డైరెక్టర్ తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మహేష్ సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. అలాగే మహర్షి డైరెక్టర్ వంశీ పైడిపల్లితో కూడా మహేష్ సినిమా చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇంకా యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల కూడా మహేష్ కోసం కథ రెడీ చేసాడని.. ఈ కథని మహేష్ ఓకే చెప్పాడని జోరుగా వార్తలు వస్తున్నాయి. ఇలా స్టార్ డైరెక్టర్స్ తో, యంగ్ డైరెక్టర్స్ తో మహేష్ టచ్ లోనే ఉంటున్నాడట కానీ.. నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ఇంకా కన్ ఫర్మ్ చేయలేదు. అయితే.. రీసెంట్ గా మరో న్యూస్ తెలిసింది.
అది ఏంటంటే.. మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో ‘ఉప్పెన’ సినిమాని తెరకెక్కించిన యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా మహేష్ తో సినిమా చేయాలనుకుంటున్నాడట. మహేష్ కోసం కథ రెడీ చేశాడట. అయితే.. ఉప్పెన సినిమా రిలీజ్ అయితే.. అప్పుడు మహేష్ ని కలవాలి అనుకుంటున్నాడని సమాచారం. బుచ్చిబాబు నెక్ట్స్ మూవీని కూడా మైత్రీ మూవీ మేకర్స్ లోనే చేయడానికి ఓకే చెప్పాడట. ఇదిలా ఉంటే.. మహేష్ నెక్ట్స్ మూవీకి సంబంధించి ఆల్రెడీ టాప్ డైరెక్టర్స్ తో డిష్కసన్స్ జరుగుతున్నాయి. అందుచేత బుచ్చిబాబు మహేష్ కి కథ చెప్పినా.. ఆ కథ నచ్చినా అంతా సెట్ అయి సెట్స్ పైకి వెళ్లాలి అంటే చాన్నాళ్లు పట్టచ్చు.
Must Read ;- మహేష్ ఆ డైరెక్టర్ తో సినిమా చేయనున్నాడని నమ్రత హింట్ ఇచ్చారా..?











