వ్యాక్సిన్లపై ఎన్నో అనుమానాలు.. ఎన్నో భయాలు.. వీటన్నింటి ప్రభావం కారణంగా కరోనా వ్యాక్సినేషన్‌పై ఎక్కవ మంది ఆసక్తి కనబరచడం లేదని విస్త్రుతంగా ప్రచారం కొనసాగుతుంది. ఇలాంటి అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ.. కేంద్రం కరోనా వ్యాక్సినేషన్ కౌంట్‌ని వడుదల చేసింది. ఈ లెక్కల ప్రకారం దేశంలో కరోనా వ్యాక్సినేషన్ జోరుగా కొనసాగుతుందని తెలుస్తుంది.
20 లక్షల మందకిపైగా వ్యాక్సినేషన్..
📍#COVID19 Vaccination Status (as on 27th January, 2021 till 07:00 PM)
💉Total no. of people vaccinated so far
➡️23,28,779💉No. of people vaccinated (on 27th January, 2021)
➡️2,99,299#Unite2FightCorona #StaySafe #IndiaFightsCorona pic.twitter.com/5YNZzLaian— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) January 28, 2021
ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం నిన్నటి వరకు (జనవరి 27) 23,28,779 మందికి టీకా వేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. నిన్న ఒక్కరోజునే 2 లక్షల 99 వేల 299 మందికి టీకా వేసినట్లు ప్రభుత్వం తెలియజేసింది. ప్రపంచంలోనే ఎక్కవగా కోలుకుంటున్న వారి సంఖ్య కూడా మన దేశంలోనే ఉండడం గమనార్హం. దేశ వ్యాప్తంగా 97 శాతం రికవరీ రేటు ఉన్నట్లు తెలియజేశారు. అంతేకాదు, కేంద్ర పాలిత ప్రాంతాలు, 31 రాష్ట్రాలలో కరోనా చికిత్స అందుకుంటున్న కేసులు 5 వేల కంటే తక్కువగా ఉండడం గమనార్హం. ఇప్పటి వరకు దేశంలో నమోదైన కరోనా కేసులు: 1,07,01,193. అందులో కోలుకున్న వారి సంఖ్య: 1,03,73,606 (96.94%), చికిత్స అందుకుంటున్న వారి సంఖ్య: 1,73,740 (1.62%), మరణాల సంఖ్య: 1,53,847 (1.44%).
Must Read ;- హనుమంతుడు సంజీవని తెచ్చారు.. భారత్ టీకా ఇచ్చింది..
కరోనా టీకా ఏర్పాట్లు
📍#COVID19 India Tracker
(As on 28 January, 2021, 08:00 AM)➡️Confirmed cases: 1,07,01,193
➡️Recovered: 1,03,73,606 (96.94%)👍
➡️Active cases: 1,73,740 (1.62%)
➡️Deaths: 1,53,847 (1.44%)#IndiaFightsCorona#Unite2FightCorona#StaySafeVia @MoHFW_INDIA pic.twitter.com/srd9pGevka
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) January 28, 2021
తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ ఏర్పాట్లు రోజు రోజుకు పెంచుకుంటూ.. టీకా లబ్ధిదారుల సంఖ్యను పెంచే ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం. ఈ రోజు (జనవరి 28) 400 వందల కేంద్రాల్లో 37 వేల మంది ప్రైవేటు ఆరోగ్య సిబ్బంది టీకా అందించే ఏర్పాట్లు పూర్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రేపు కూడా కొవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. 30న టీకాకు విరామం ఇస్తున్నట్లు ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం, టీకా సేవలను వినియోగించుకోవాల్సిందిగా తెలిపారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎటువంటి అనుమానాలు ఉన్నా ప్రభుత్వంతో సంప్రదింపులు జరపవచ్చని, కానీ ఎట్టి పరిస్థితుల్లో కరోనా వ్యాక్సినేషన్ విషయంలో మాత్రం అలక్ష్యం ప్రదర్శించవద్దని రాష్ట్రం.. ప్రైవేటు ఆరోగ్య సంస్థలకు తెలియజేశారు.
Also Read ;- కరోనా వ్యాక్సిన్ వికటించి డాక్టర్‌కు తీవ్ర అస్వస్థత