ఐశ్వర్యా రాజేష్.. మూడు భాషల్లో అవకాశాలు ఆమె తలుపుతడుతున్నాయి. తెలుగులో కౌసల్యా కృష్ణమూర్తి, వరల్డ్ ఫ్యామస్ లవర్ లలో నటించిన ఐశ్వర్య తాజాగా టక్ జగదీష్ లో నాని సరసన నటిస్తోంది. ఆదివారం ఆమె పుట్టిన వేడుకలు జరుపుకుంది. ‘డ్రైవర్ జమున’ అనే టటైల్ రోల్ ను ఆమె తమిళంలో పోషించబోతోంది. ఇందులో ఆమెది క్యాబ్ డ్రైవర్ పాత్ర. దీనికి పి. కిన్ స్లిన్ దర్శకత్వం వహించనున్నారు. 18 రీల్స్ పతాకంపై ఎస్పీ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది చెన్నై నేపథ్యంలో సాగే కథ. క్రైం థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కబోతోంది.
గిబ్రాన్ సంగీత దర్శకత్వం వహించే ఈ సినిమా మార్చి మొదటివారంలో సెట్స్ పైకి వెళుతుంది. ఆమె నటించిన ‘భూమిక’ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఆ చిత్రానికి దర్శకుడు రతీంద్రన్. దర్శకుడిగా అతని మొదటి చిత్రం ‘ఇదు వేదాళం సొల్లుం కథాయ్’ లో అశ్విన్ కాకుమాను, అభయ్ డియోల్ నటించారు. ఇందులో ఐశ్వర్యా రాజేష్ కూడా ఓ పాత్ర పోషించింది. అయితే ఈ సినిమా ఇంతవరకు విడుదలకాలేదు. దర్శకుడు కె. భాగ్యరాజా 37 సంవత్సరాల క్రితం రూపొందించిన ముంధానై ముడిచ్చును కూడా రీమేక్ చేయనున్నారు. ఇందులోనూ ఐశ్వర్య నటిస్తోంది.
ఇందులో హీరోగా శశికుమార్ నటిస్తున్నారు. ఆమె ఈమధ్య కాపే రణసింగంలో నటించింది. తన భర్త మృతదేహాన్ని తీసుకు రావడానికి వ్యవస్థతో పోరాడే నిస్సహాయ పాత్రను పోషించింది. ఇడిమ్ పోరుల్ యెవల్, ధ్రువా నాట్చాతిరామ్ తదితర చిత్రాల్లోనూ ఆమె నటిస్తోంది. శంకర్ భారతీయుడు 2లో ఓ కీలక పాత్రను ఆమె పోషించాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవలసి వచ్చింది. అవకాశాలు వెల్లువలా వచ్చి పడటంతో ఆమె చకచకా సినిమాలు చేసేస్తోంది.
Must Read ;- నెగెటివ్ షేడ్స్ తో మెప్పించిన దేవసేన వదినమ్మ