పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై హైకోర్టు తీర్పు తరవాతైనా సీఎం నిర్ణయం మార్చుకోవాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు విజ్ఙప్తి చేశారు. మీ తప్పుడు నిర్ణయం సవరించుకోవడానికి కోర్టు ఒక అవకాశం కల్పించిందని భావిస్తున్నానని ఆయన అన్నారు.పరీక్షలు వాయిదా వేయడం,లేదంటే రద్దు చేయాలని కోరారు. మీరు రద్దు చేయకుండే మే 3న కోర్టు రద్దు చేస్తుందన్నారు. పరీక్షలు నిర్వహించాలనే మీ ఆలోచనలకు అర్థం ఉందా? సందింటిలో నుంచి రాజప్రసాదంలోకి వచ్చారు. ఇప్పుడైనా ఆత్మవిమర్శ చేసుకోండని ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిపై రఘురామరాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజల ప్రాణాలను తీసే హక్కు ప్రజలు మీకిచ్చారని మీరు భావిస్తున్నారా? అని ఆయన సీఎంను ప్రశ్నించారు.
విద్యార్ధులు ధైర్యంగా ఉండండి
పెద్దగా చదువుకోకపోతే ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ కూడా ఉందని రఘురామరాజు సీఎంపై సెటైర్లు వేశారు. కరోనా తగ్గిన తరవాత పరీక్షలు నిర్వహించవచ్చని, ఒక వేళ కుదరకపోతే అందరూ పాస్ అయినట్టు సర్టిఫికేట్ ఇవ్వవచ్చన్నారు. మా పిల్లలు పరీక్షలు రాయడానికి చాలా ఉత్సాహం చూపుతున్నారని ఏపీ ప్రభుత్వ ఏజీ హైకోర్టులో వాదనలు వినిపించారు. దీనిపై రఘురామరాజు స్పందించారు. అడ్వకేట్ జనరల్ గారు మీ పిల్లలకు ధైర్యం ఎక్కువ, మీరు రాజ్యాంగబద్ద పదవిలో ఉన్నారు. పరీక్షలు రాసే వారిలో ఎక్కువగా బీదవారు ఉంటారు. వారికి అంత ధైర్యం ఉండదని రఘురామరాజు అభిప్రాయపడ్డారు.
అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలి
2019 ఎలక్షన్లు ముందు అమరావతి రాజధాని ఇక్కడే ఉంటుంది ఎక్కడకూ పోదన్నారా? లేదా? అని సీఎం జగన్మోహన్‌రెడ్డిని రఘురామరాజు ప్రశ్నించారు. తట్టాబుట్టా సర్దుకుని విశాఖ వెళ్లే ప్రయత్నం మానుకుంటే మీకు మంచిది, ఈ రాష్ట్రానికి మంచిదని ఆయన సలహా ఇచ్చారు. 500 రోజులుగా అమరావతి కోసం ఉద్యమం చేస్తున్న రైతులకు రఘురామరాజు ధైర్యం చెప్పారు. రైతుల శ్రమ ఊరికే పోదన్నారు.
Must Read ;- పది, ఇంటర్ పరీక్షలపై పున:పరిశీలన చేయండి.. హైకోర్టు