సహజత్వానికి దగ్గరైన ప్రేమ కథల్ని తెరకెక్కించడంలో దర్శకుడు శేఖర్ కమ్ములకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తాజాగా రూపొందిస్తున్న ”లవ్ స్టోరి”. చిత్రాన్ని కూడా వాస్తవికత ఉట్టిపడేలా ప్రతిబింబిస్తున్నారు.ఇందులో నాగ చైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా తాజాగా తీసిన పాట చిత్రీకరణతో ఈ చిత్రం చిత్రీకరణ ముగిసింది. ఈ ఆనందాన్ని ఎంచక్కా ఆస్వాదిస్తూ దర్శకుడు శేఖర్ కమ్ముల, హీరోయిన్ సాయి పల్లవి, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, సినిమాటోగ్రాఫర్ విజయ్ సి కుమార్ ఫొటో తీసుకున్నారు.
చివరిగా తీసిన పాటను నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించి.. అది పూర్తి కాగానే .సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు. ఇక థియేటర్లు తెరుచుకున్న తర్వాత ప్రేక్షకుల సందడి ఆరంభం కాగానే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తామని నిర్మాతలు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. ఇంకా ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రలను పోషించారు.
సినిమాటోగ్రఫీని విజయ్ సి.కుమార్, సంగీతాన్ని పవన్ సి.హెచ్ అందిస్తున్నారు. సహ నిర్మాత :భాస్కర్ కటకంశెట్టి.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఐర్ల నాగేశ్వర రావు, రచన,దర్శకత్వం: శేఖర్ కమ్ముల.
Must Read ;- చైతు రెండో సారి మూడు పాత్రలు











