బిగ్ బాస్ 4 స్టార్టింగ్ లో చాలా చప్పగా సాగుతుంది అనుకుంటుంటే.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా జబర్థస్ట్ అవినాశ్ హౌస్ లో అడుగుపెట్టాడు. అంతే.. ఇక అక్కడ నుంచి హౌస్ లో ఎంటర్ టైన్మెంటే ఎంటర్ టైన్మెంట్. మిమిక్రీ కూడా రావడంతో అవినాశ్ హౌస్ లో ఉన్న వారినే కాకుండా షో చూస్తున్న వారందర్నీ ఆకట్టుకున్నాడు. మంచి మార్కులు కొట్టేసాడని చెప్పచ్చు. అవినాశ్ కామెడీకి నాగ్ సైతం ఫిదా అయ్యారు. ఇక వీకెండ్ వచ్చిందంటే.. నవ్వులే నవ్వులు అని చెప్పచ్చు. తన గేమ్ ను బాగా ఆడుతూనే అందర్నీ బాగా ఎంటర్ టైన్ చేసాడు.
ఆఖరికి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయేటప్పుడు కూడా స్టేజ్ పై అదరగొట్టేసాడు. హౌస్ లో ఉన్న వారు ఎలా ప్రవర్తిస్తారో.. కళ్లకు కట్టినట్టు చూపించి ఎంటర్ టైన్ చేసాడు. నాగార్జున అయితే.. కడుపుబ్బా నవ్వారు. అంతే కాకుండా.. ఎంటైర్ బిగ్ బాస్ లోనే నువ్వు అందరి మనసులు దోచుకున్నావ్. బయటకు వెళితే తెలుస్తుంది ఇంత కంటే నీకు ఏం కావాలి అని అవినాశ్ తో చెప్పారు. నాగార్జున అలా చెప్పడంతో అవినాశ్ ఆనందానికి అవధులు లేవని చెప్పచ్చు. ఇప్పుడు అవినాశ్ వరుసగా మీడియాకి ఇంటర్ వ్యూలు ఇస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నాడు.
ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఒక రోజు నాగార్జున వేసుకున్న షర్ట్ బాగుందని అవినాశ్ అన్నాడు. అది గుర్తుపెట్టుకొని మరీ.. నాగార్జున ఆ షర్ట్ ను అవినాశ్ ఇంటికి పంపించారు. నాగ్ సార్.. తను అన్న మాటలను గుర్తుపెట్టుకుని ఇలా స్పెషల్ గిఫ్ట్ పంపించడంతో అవినాశ్ ఆనందంలో తేలిపోతున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాద్వారా తెలియచేసాడు. అంతే కాకుండా.. ఆషర్ట్ వేసుకొని దిగిన ఫోటోను కూడా షేర్ చేసాడు.
Must Read ;- బిగ్ బాస్ 4 విజేత ఎవరో బయటపెట్టిన అవినాశ్..