నేచురల్ స్టార్ నానీ.. రొమాన్స్, యాక్షన్, కామెడీ.. ఇలా అన్ని రకాల జోనర్స్ ను టచ్ చేయాలనుకొనే హీరో. ఎలాంటి పాత్రను పోషించినా దానికి నూటికి నూరు శాతం న్యాయం చేయాలనుకుంటాడు అతడు. ఈ నేపథ్యంలో నానీ నటిస్తోన్న ఓ క్లాస్ టచ్ ఉన్న మాస్ మూవీ టక్ జగదీష్. నానీతో నిన్ను కోరి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన శివ నిర్వాణ ఈ సినిమాకి దర్శకుడు.
ఎర్లియర్ గా నాగచైతన్యతో మజిలీ సినిమా తీసి హిట్టందుకున్న శివ నిర్వాణ .. ఈ సారి టక్ జగదీష్ తో ఫ్యామిలీ రిలేషన్స్ .. హ్యూమన్ ఎమోషన్స్ నేపథ్యాన్ని ఎంచుకున్నాడు. ఏప్రిల్ 23న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా.. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్ని మొదలు పెట్టారు మేకర్స్ . అందులో భాగంగా టక్ జగదీష్ సినిమా టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఏటికొక్కపూట.., ఏడాది మాట..నాయుడోరి నోటనుంచి వచ్చిందే మాట అనే సాంగ్ నేపథ్యంతో ఈ సినిమా టీజర్ ను కట్ చేశారు. ఇందులో టక్ చేసుకున్న నానీ కోడిపుంజుతో ఎంట్రీ ఇచ్చే సీన్ ఆకట్టుకుంటుంది. ఇక నానీ అన్న గా జగపతిబాబు, తండ్రిగా నాజర్ కనిపించారు. ఇదో ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో సాగే ఓ యాక్షన్ ఎమోషనల్ మూవీ అని అర్ధమవుతోంది. అలాగే ఇందులో తమిళ నటుడు డేనియల్ బాలాజీ విలన్ గా నటించాడు. టక్ చేసుకునే నానీ.. కయ్యానికి కాలు దువ్వే రకమని.. తన కుటుంబం జోలికి ఎవరొచ్చినా తాట తీసే స్వభావమున్న యువకుడని తెలుస్తోంది. తమన్ సంగీతం అందిస్తోన్నారు. రీతూ వర్మ కథానాయికగా నటిస్తోన్న టక్ జగదీష్ మూవీ నానీ కి ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి.
Must Read ;- నానీ ‘టక్ జగదీష్’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!