చిత్రవధకు గురిచేశారు ..!
జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఎంపీనని కూడా చూడకుండా జైల్లో వేసి చిత్రవధకు గురిచేశారని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో తన వేదనను వెల్లబుచ్చుకున్నారు. ఒక పథకం ప్రకారమే తనును జైలుకు రప్పించి.. అక్కడే చంపేందుకు కుట్ర పన్నారని ఎబిఎన్ రాధాకృష్ణ సమక్షంలో వాపోయ్యారు. తనను జైలుకు తీసుకెళ్లినప్పుడు మేజిస్ట్రేట్ రెండు హాస్పటల్స్ కు తీసుకెళ్లి రిపోర్టు ఇవ్వమని చెబితే .. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో మాత్రమే పరీక్షలు చేయించి మేజిస్ట్రేట్ దగ్గరకు తీసుకెళ్లకుండా నేరుగా జైలుకు తీసుకెళ్లారు. అదేంటని అడిగితే .. పోలీసులు పరుషపదజాలంతో తిట్టి .. నెట్టుకుంటూ జైలు గదికి తీసుకెళ్లారని రఘురామ తనగోడు విన్నవించుకున్నారు. పోలీసులు విచక్షణ రహింతంగా తనను కొట్టారని, జైలు నాలుగు గోడల మధ్య తాను అనుభవించి చిత్రవధను రఘురామ ఇలా చెప్పుకొచ్చారు.
జగన్ ప్రభుత్వంపై రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోంది..!
జగన్ చర్యలకు ప్రజలు విసిగి వేజారారు. ఆయన ప్రభుత్వంపై రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోందని ఎంపీ రఘురామ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో వివరించారు. ఓటీఎస్ (స్కీం) స్కాం, సినిమా టికెట్ల ధరల తగ్గింపు, జగన్ చెల్లెలు షర్మిల రాజకీయ అడుగులు ఏపి వైపు కూడా పడే అవకాశాలు, చేస్తున్న అప్పులు, కడుతున్న వడ్డీలు, కుటుంపడ్డ అభివృద్ధి, సొంతపార్టీ ప్రజాప్రతినిధులు పడుతున్న ఇబ్బందులు, వలంటీర్ల వ్యవస్థతో పార్టీ మునిగిపోతోంది.. అన్న తదితర అంశాలను కూలంకుషంగా ఎంపీ ఆర్ఆర్ఆర్ ఎబిఎన్ ఆర్కేకు వివరించారు.
Must Read ;- నాపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ.. సెల్ ఫోన్లో ఒకరికి లైవ్ చూపారు!











