ఆర్ఆర్ఆర్.. దేశం మొత్తం ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం. బాహుబలి సినిమాతో చరిత్ర సృష్టించిన తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా కావడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించారు. టీజర్ అండ్ ట్రైలర్ కు అనూహ్యమైన స్పందన రావడంతో ఆర్ఆర్ఆర్ చరిత్ర సృష్టించడం ఖాయమనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేశారు.
ఇదిలా ఉంటే.. మళ్లీ ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల వాయిదా పడనుంది అని గట్టిగా టాక్ వినిపిస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే.. ప్రస్తుతం దేశంలో మళ్లీ మారుతున్న పరిస్థితులు రీత్యా ఈ సినిమా వాయిదా పడనుంది అనే వార్త వైరల్ అవుతుంది. ఆల్రెడీ మహారాష్ట్ర లో నైట్ కర్ఫ్యూ విధించారు. అలాగే ఇదే బాటలో మన దక్షిణాదిలో కూడా మరికొన్ని రాష్ట్రాల్లో కూడా నిబంధనలు పెట్టేందుకు చూస్తున్నట్టు తెలుస్తోంది. మోదీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. జనవరి నుంచి టీకా, బోస్టర్ డోస్ వేయనున్నట్టుగా ప్రకటించారు. దీనితో ఈ సినిమా రిలీజ్ నాటికి పరిస్థితి ఇలానే ఉంటే వసూళ్ళ పై బాగా ప్రభావం పడుతుంది.
అందుచేత ఈ బిగ్ బడ్జెట్ మూవీ వాయిదా పడే సూచనలు ఉన్నాయని అంటున్నారు. ఇలా వార్తలు వస్తున్నప్పటికీ ఆర్ఆర్ఆర్ టీమ్ మాత్రం నార్త్ లో ఇంకా ప్రచారం చేస్తుంది. హైదారాబాద్ లో డిసెంబర్ 31న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా చేయాలి అనుకున్నారు. అయితే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా పర్మిషన్ ఇవ్వలేదట. అందుచేత డిసెంబర్ 31న హైదరాబాద్ లో చేయాలనుకున్న ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యిందని సమాచారం. మరి.. ఆర్ఆర్ఆర్ రిలీజ్ వాయిదా అంటూ వస్తున్న వార్తల పై మేకర్స్ త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
Must Read ;- ఆర్ఆర్ఆర్ బిగ్గెస్ట్ ఈవెంట్ అఫిషియల్ అనౌన్స్ మెంట్











