పూజా హెగ్డే.. ఈ పేరు చెబితే చాలు కుర్ర కారు గుండెలు ఉప్పొంగుతాయి.. ‘రంగస్థలం’ జిల్ జిల్ జిల్ జిగేలు రాణి పాట వింటే చాలు అరవైలోని వారూ ఇరవైలా గెంతులేస్తారు. తెలుగు సినిమాకు గోల్డెన్ లెగ్ భామగా పేరు తెచ్చుకుంది. వరుణ్ తేజ్ తొలి సినిమా ‘ముకుందా’లో మురిపించినా జిగులు రాణి పాట తర్వాతే ఆ జిగేలు మెరుపులు తెలుగు తెరపై తళుక్కుమంటున్నాయి. కరోనా రాకుంటే ఈమె వెలుగులు ఇంకా ఏ స్థాయిలో ఉండేవో. పూజా మీద ఎంతో మందికి క్రష్ ఉండొచ్చు.. కానీ ఆమెకు కూడా క్రష్ లేకుండా ఎలా ఉంటుంది.
ఇంతకీ ఆమెకు క్రష్ ఉన్న హీరో ఎవరో తెలుసా.. ఇంకెవరు కండల వీరుడు సల్మాన్ ఖాన్. సల్మాన్ అంటే ఆమెకు పిచ్చ అభిమానమట. అలాంటిది అతనితో నటించే అవకాశం ఉంటే ఎగిరిగంతేయకుండా ఎలా ఉంటుంది. ఆ అవకాశం ‘కభీ ఈద్ కభీ దీవాళి’ సినిమాతో వచ్చేసింది. గత ఏడాది అక్షయ్ కుమార్ హౌస్ ఫుల్ 4లో నటించింది. బాలీవుడ్ ఆమెకు కలిసివచ్చినట్టే ఉంది. ఈ ఏడాది సల్మాన్ సినిమా. ఈ సినిమాకి ఫర్హాద్ సమ్జీ దర్శకత్వం వహిస్తున్నారు. హిందీలో ఆమెకు ఇది మూడో సినిమా అవుతుంది.
గతంలో మొహంజోదారోలో హృతిక్ రోషన్ సరసన నటించింది. అక్కడ హిట్లు లేకపోవడంతో తెలుగు పరిశ్రమకు వచ్చి మంచి అవకాశాలు కొట్టేసింది. మొదట్లో ఆమెకు అంతగా కలిసిరాలేదు. నాగచైతన్య ‘ఒక లైలా కోసం’ సినిమాతో తెలుగులో తెరంగేట్రం జరిగింది. ఇప్పుడు తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరంటే పూజనే అనాలి. ప్రభాస్ ‘రాధేశ్యామ్’ లో పూజను ఓ రేంజ్ లో చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పైగా ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కావడం కూడా పూజకు కలిసొచ్చే అదృష్టం.
Must Read ;- అదృష్టానికి కేరాఫ్ అడ్రెస్ పూజా హెగ్డే