గ్రేటర్ ఎన్నికల నేపథ్యమో.. లేక బీజీ షెడ్యూల్‌లో మార్పో గానీ ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన సమయం హఠాత్తుగా మారిపోయింది. ఈ రోజు సాయంత్రం నగరానికి రావాల్సిన ప్రధాని పర్యటన షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు జరిగాయి. సాధారణంగా ప్రధాని పర్యటనకు సంబంధించి రెండు వారాల ముందే షెడ్యూల్ ఖరారు అవుతుందట. కానీ ఈ హైదరాబాద్ పర్యటన అకస్మికంగా తయారైనట్లు తెలుస్తోంది.
ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు ప్రధాని నరేంద్ర మోడీ హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి భారత్ బయోటెక్‌కు చేరుకుని అక్కడ కరోనా టీకా కోవాగ్జిన్ పురోగతిని పరిశీలిస్తారు. అనంతరం 3 గంటలకు మళ్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకుని వెళ్లిపోతారు. అయితే భారత్ బయోటెక్ సంస్థ అధికారులతో సుమారు ఓ గంట సేపు గడిపి కరోనా వ్యాక్సిన్ తయారి వివరాలను అడిగి తెలుసుకుంటారు.
షెడ్యూల్లో మార్పు అందుకేనా…
కేసీఆర్ ఈ రోజు ఎల్బీ స్టేడియంలో ఎన్నికల ప్రచార సభలో సాయంత్రం పాల్గొంటారు. ఈ సభ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య జరగనుంది. దాదాపు ఇదే టైంలో మోడీ హైదరాబాద్లో పర్యటించనున్నారు. అయితే మొదట ప్రధాని షెడ్యూల్ కూడా దాదాపు సాయంత్రమే ఫిక్స్ అయింది. ఆ తరువాత మధ్యాహ్ననానికి కేసీఆర్ సభకు కాస్త ముందుకు ఛేంజ్ అయింది. కేసీఆర్ సభకు కౌంటర్‌గానే ప్రధాని పర్యటనలో మార్పులు చేర్పులు చేసి ఉంటారనే చర్చ జరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల దూకుడును అడ్డుకునేందుకు కేసీఆర్ సభతో తమ ప్రచారాన్ని పీక్ స్టేజీకి తీసుకెళ్లాలని టీఆర్ఎస్ అనుకుంటుంది. అయితే దీనికి కౌంటర్‌గానే ప్రధాని హైదరాబాద్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసి మధ్యాహ్నం నగరానికి వచ్చేలా ప్లాన్ చేసి ఆ ప్రభావం గ్రేటర్‌పై పడేలా బీజేపీ అగ్రనాయకత్వం ప్లాన్ చేసి ఉంటారనే చర్చ జరుగుతోంది. గ్రేటర్ ఎన్నికలకు నరేంద్రమోడీ పర్యటనకు నేరుగా ఎలాంటి సంబంధం లేకున్నాగానీ మోడీ హైదరాబాద్‌లో అడుగుపెడితే ఆ ప్రభావం ఇక్కడి ఓటర్లపై పడే అవకాశం లేకపోలేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు బీజీపీ అగ్రనాకత్వం ఇప్పటికే నగరానికి వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుండగా మరోవైపు నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.
రావాల్సిన అవసరం లేదు..
ప్రధాని నరేంద్ర మోడీ తన అధికారిక పర్యటనలో భాగంగా ఈ రోజు హకీంపేట విమానాశ్రయానికి వస్తున్నారు. ప్రోటోకాల్లో భాగంగా దేశ ప్రధాని రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్ర గవర్నర్‌తో పాటు సీఎం కూడా ప్రధానిని స్వాగతం పలికేందుకు మర్యాదపూర్వకంగా వెళ్తారు. దేశ ప్రధాని రాష్ట్రానికి వస్తున్నప్పుడు దానికి సంబంధించిన ముందస్తు సమాచారాన్ని పీఎంఓ కార్యాలయం రాష్ట్రానికి తెలియజేస్తుంది. పీఎం వస్తుండటంతో ప్రధానిని స్వాగతం పలికేందుకు ఎయిర్‌పోర్టుకు సీఎం వస్తున్నారనే సమాచారాన్ని పీఎంఓ కార్యాలయాలకు అధికారులు చేరవేసారట. దీనికి బదులుగా పీఎంఓ అధికారులు.. కోవిడ్ నేపథ్యం కారణంగా ఎయిర్‌పోర్టుకు రావాల్సిన అవసరం లేదనే సమాచారాన్ని రాష్ట్ర అధికారులకు పంపించినట్లు సమాచారం.
Must Read ;- సర్జికల్ స్ట్రైక్ నుంచి ‘సమాధులకు’ చేరుకున్న జీహెచ్ఎంసీ ఎన్నికల రాజకీయం!











