కరోనా మహమ్మారి వలన సామాన్య ప్రజలతో పాటుగా సెలబ్రెటీలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కరోనా కారణంగా భారతీయ చలన చిత్ర పరిశ్రమ చాలా నష్టపోయిందనే చెప్పాలి. ఇప్పటికే అనేకమంది సినీ ప్రముఖులు కన్నుమూశారు. మరికొంతమంది ఇంటికే పరిమితం అయ్యారు. కొంతమంది హీరోలు షూటింగ్ల కోసం బయటకు వస్తే వారికి కూడా కరోనా సోకిన సంఘటనలు ఇటీవల చాలానే జరిగాయి.
ఇక సినీ ప్రముఖుల పర్సనల్ స్టాఫ్ కనుక కరోనా బారిన పడితే ప్రముఖులు కూడా ఇంటికే పరిమితం అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ కండల వీరుడు, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు ఇదే పరిస్థితి ఎదురైంది. ఆయన వద్ద పనిచేస్తున్న కార్ డ్రైవర్ కు మరో ఇద్దరు పర్సనల్ స్టాఫ్ కు కరోనా సోకినట్లు సమాచారం. ఇటీవలే ఈ ముగ్గురు ఆరోగ్యం బాలేదని హాస్పటల్ కు వెళ్లగా అక్కడ ఉన్న డాక్టర్ల సలహా మేరకు కరోనా టెస్ట్ చేయించుకున్నారని, ఆ టెస్టులో కరోనా పాజిటివ్ వచ్చిందని తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన వెంటనే సల్మాన్ ఖాన్ అప్రమత్తం అయ్యాడు.
తన కుటుంబ సభ్యులతో పాటు సల్మాన్ ఖాన్ 14రోజులు హోమ్ ఐసోలేషన్ లో ఉండనున్నాడని బాలీవుడ్ వర్గాల సమాచారం. 14రోజుల పాటు తను ఎటువంటి షూటింగ్స్ కు హాజరుకానని ఇప్పటికే దర్శకనిర్మాతలకు సల్మాన్ తెలియజేసారని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ తీసుకున్న ముందు జాగ్రత్త చర్య మంచిదే అని కొందరు డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. తమ అభిమాన హీరో సల్మాన్ ఖాన్ కు ఎటువంటి ఆపద రాకూడదని అభిమానులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కరోనా విజృభిస్తున్న సమయంలో సల్మాన్ ఖాన్ వేలాది మంది ప్రజలకు ఉచిత రేషన్ పంపిణీ చేసిన విషయం తెలిసిందే.
MustRead ;- బాలీవుడ్ హాట్ బాంబ్ కి షాకిచ్చిన గోవా పోలీసులు