ముక్కుసూటిగా మాట్లాడతాడని.. ఏదైనా కుండబద్ధలు కొడతాడని.. అస్సలు మొహమాటమే పడడని..ఎంతటి వారినైనా ఏదైనా అనేస్తాడని.. అందరికీ ఆయన మాటలంటే ఇంట్రెస్ట్. ఆయన కెమెరా ముందుకొచ్చాడంటే ఏం మాట్లాడతాడా అని ఆత్రంగా ఎదురు చూసేశారు. ఆయన మాట్లాడాడంటే ఏదైనా కాస్త నిజం ఉంటేనే మాట్లాడతాడని అనుకునేవారు. కాని ఇదంతా గతం.. కాని పోసాని కృష్ణమురళి కూడా నాలుకను ఎటువైపయినా..ఎలాగైనా తిప్పుతాడని అర్ధమయ్యాక.. ఆయన నిజాయితీ గాలిదేనని తేలాక.. జనం పట్టించుకోవడం మానేశారు. కాని ఏపీలో వైసీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ ఆయనను బాగానే వాడుతున్నాయి. కాని ఉపయోగం లేదని ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది. సరిగ్గా ఏదైనా పోలింగ్ ఉంటే..కరెక్టుగా ముందు రోజే మీడియా ముందుకొచ్చి మాట్లాడటం రాజా స్పెషాలిటీ.

వైసీపీ ఏం దుర్మార్గాలు చేసిందంటూ..
మున్సిపల్ ఎన్నికలకు ముందు అలాగే మీడియా ముందుకొచ్చి.. వైసీపీ ఏం దుర్మార్గాలు చేసిందని ఎదురు ప్రశ్నించాడు. పైగా టీడీపీ చేసిన వాటి కంటే ఎక్కువా అంటూ ప్రశ్నించాడు. పవన్ కల్యాణ్ వైసీపీపై విమర్శలు చేయడాన్ని కూడా తప్పుబట్టాడు.. అప్పుడు టీడీపీ చేసినప్పుడు అడగలేదేంటి అంటూ నిలదీశాడు. అంటే మీడియా సాక్షిగా, ఓపెన్‌గా అడ్డగోలుగా వైసీపీ చేస్తున్నవాటన్నిటని సమర్ధించుకొస్తున్నాడంటే.. ఇక పోసానిలో నిజాయితీని ఎక్స్ పెక్ట్ చేయడం పిచ్చిపనే అవుతుంది. అసలు పోటీయే లేకుండా చూసుకోవడం.. ఒకవేళ పోటీకి ఎవరైనా వచ్చినా బెదిరించడం.. అవి కూడా రకరకాలుగా.. పోలీసులతోనూ, అధికారులతోనూ చేయించడం.. అన్నీ జనం చూస్తూనే ఉన్నారు. అయినా వాటిని వెనకేసుకొచ్చాక పోసాని మొహమాటం లేకుండా మాట్లాడాతాడనుకోవడం ఇక పొరపాటే. ఆయన అధికారపార్టీకి అమ్ముడుపోయాడనే కామెంట్లు వస్తున్నాయి. అంతకు ముందు ఆయన నమ్మిందే చెప్పేవాడని అనుకునేవారు.. కాని ఆయన ఎవరిని నమ్ముకున్నాడో వాళ్లు చెప్పిందే చెబుతాడని ఇప్పుడే అర్ధమవుతోంది.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలప్పుడు కూడా..
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలప్పుడు కూడా బాస్ పోలింగ్ ముందురోజు వచ్చి.. టీఆర్ఎస్ సూపరని చెప్పుకొచ్చాడు. అయినా జనం పట్టించుకోలేదు. అలాగే ఇప్పుడు వైసీపీ శెభాష్ అంటే పట్టించుకునేంత సహనం కూడా జనానికి లేదు. ఎటూ బెదిరింపులు, డబ్బులతో విజయాలు సాధించటం వైసీపీకి అలవాటైపోయింది. ఆ రకంగా గెలవాల్సిందే తప్ప.. ఎన్నికలు సక్రమంగా జరిగితే ఫలితాలు వేరేగా ఉంటాయి. టీడీపీ, జనసేనలు గట్టిగా నిలబడ్డచోట ఎలాంటి ఫలితాల వచ్చాయో ఫంచాయతీ ఎన్నికల్లో చూశాం. మున్సిపల్ కూడా అలాగే ఉంటుందని అందరూ భావిస్తున్నారు.
ఏమైనా పోసాని కృష్ణమురళి కాలర్ పదే పదే ఎగరేస్తూ చెప్పే డైలాగులు నిజాయితీగా ఛెప్పేవి కావని తేలిపోయింది. ఆయనేదో నిర్మొహమాటంగా మాట్లాడతానుకోవడం కూడా భ్రమే. అధికార పార్టీకి సెటప్ అయిపోయి.. మొహమాటంతోనే ప్రెస్ మీట్ పెడుతున్నాడని కూడా క్లారిటీ వచ్చేసింది. అందుకని రాజా.. పవన్‌కు సలహాలు ఇవ్వడం కాదు.. ముందు నీ సంగతేంటో చూసుకోవడం మంచిది రాజా..
Must Read ;- ’ఉక్కు‘పై ప్రకటనతో వైసీపీ నేతలకు ముచ్చెమటలు.. గ్రేటర్ విశాఖలో అంచనాలు తారుమారు?











