ఏపీ సీఎం జగన్ పై నరసాపురం ఎంపీ రఘురామరాజు లేఖల దాడి కొనసాగుతూనే ఉంది. ఒక్కో లేఖలో.. ఒక్కో హామీని గుర్తుకు తెస్తూ వైసీపీ ప్రభుత్వాన్నిఇరకాటంలోకి నెట్టేస్తున్నారు. ఇప్పటికే నవరత్నాలు, వైఫల్యాల పేరుతో లేఖలు రాసిన రఘురామ మంగళవారం మరో లేఖను సంధించారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న అన్న క్యాంటీన్ల స్థానంలో… జగనన్న క్యాంటీన్లను తెరవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారని, పేదలకు మంచి ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు.
దైవదూతగా పేర స్థిరపడిపోతుంది
వైఎస్ జయంతి సందర్భంగా జగనన్న లేదా రాజన్న పేరుతో క్యాంటీన్లను ప్రారంభించాలని రఘురామరాజు తన లేఖలో సూచించారు. పేదలు ఆకలిని తీర్చే క్యాంటీన్లను వెంటనే ప్రారంభించాలని, తద్వారా మీకు పేరొస్తుందని, దైవదూతగా జనాల్లో పేరొస్తుందని రఘురామ అన్నారు. మానవత్వం ప్రదర్శించేందుకు క్యాంటీన్లు వేదికగా నిలుస్తాయని జగన్ రాసిన లేఖలో రఘురామరాజు పేర్కొన్నారు. గత లేఖలో రఘురామరాజు శాసనమండలి గురించి ప్రస్తావించారు. మెజార్టీ ఉన్నప్పుడు మండలిని రద్దు చేయాలని డిమాండ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే..
Must Read ;- అడిగేది లేదంటే మడమ తిప్పినట్టేగా!











