దర్శక ధీరుడు రాజమౌళి క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ పై ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ నెలకొంది. అక్టోబర్ 13న సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుండడంతో ఈ సినిమాకి సంబంధించిన ప్రతీ అప్టేడ్ అభిమానులకు పిచ్చెక్కిస్తోంది. తారక్, చెర్రీ పుట్టిన రోజుల్ని పురస్కరించుకొని విడుదలైన స్పెషల్ టీజర్స్ , ఇతర నటీనటుల పుట్టిన రోజు నాడు విడుదలైన పోస్టర్స్ అంచనాల్ని రెట్టింపు చేశాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా రాజమౌళి ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో విజువల్ వండర్ గా తీర్చిదిద్దుతున్నాడు.
ఇక ఇప్పుడు అందరూ ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి తెగ చర్చించుకుంటున్నారు టాలీవుడ్ లో. దీనికి నమ్మ శక్యం కాని రీతిలో ఏకంగా రూ. 900 కోట్ల బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ కు చెందిన పెన్ ఇండియా సంస్థ ఆర్.ఆర్.ఆర్ సినిమా శాటిలైట్ , డిజిటల్ రైట్స్ తో పాటు .. హిందీ వెర్షన్ ప్రదర్శిత హక్కుల్ని కూడా సొంతం చేసుకుంది. దీని కోసం ఈ సంస్థ రికార్డు స్థాయిలో 480కోట్లు చెల్లించినట్టు సమాచారం.
వరల్డ్ వైడ్ గా ‘ఆర్.ఆర్.ఆర్’ బిజినెస్ వివరాలు
నార్త్ ఇండియా పెన్ స్టూడియోస్.. రూ. 480 కోట్లు
తమిళనాడు లైకా ప్రొడక్షన్స్ …….. రూ. 45కోట్లు
కేరళ …….. రూ. 15కోట్లు
కర్నాటక ……. రూ.50కోట్లు
నైజాం ……. రూ. 75కోట్లు
ఆంధ్రా……. రూ. 100కోట్లు
సీడెడ్ …….. రూ. 45కోట్లు
ఆడియో రైట్స్ ….. రూ. 25కోట్లు
ఓవర్సీస్ పారస్ ఫిల్మ్స్ ……. రూ. 65 కోట్లు
టోటల్ బిజినెస్ …….. రూ. 900కోట్లు
Also Read:‘వైల్డ్ డాగ్’ మూవీ రివ్యూ