అక్కినేని అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీ చేస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. ఇప్పుడు ప్లాన్ మారింది. సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. జీఏ2 బ్యానర్ లో రూపొందుతోన్న ఈ సినిమాని వాసు వర్మ – బన్నీ వాసు సంయుక్తగా నిర్మిస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలోఈ మూవీ రూపొందుతోంది. అయితే… ఈ సినిమా సెట్స్ పై ఉండగానే.. అఖిల్, స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో సినిమా చేయనున్నట్టు ప్రకటించారు.
ఈ క్రేజీ మూవీని ఎకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ప్రకటించినప్పటి నుంచి అక్కినేని అభిమానులు ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీ గురించి అప్ డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రాలేదు. అయితే.. ఈ సినిమాలో అఖిల్ సరసన నటించే హీరోయిన్ గురించి ఓ వార్త బయటకు వచ్చింది. ఇంతకీ ఎవరంటే.. ముంబాయికి చెందిన మోడల్ సాక్షి వైద్య చాలా యాడ్స్ లో నటించింది.
ఈ అమ్మాయి అయితే అఖిల్ సరసన కరెక్ట్ గా సెట్ అవుతుందని సురేందర్ రెడ్డి అనుకుంటన్నారట. రీసెంట్ గా హైదరాబాద్ లో సాక్షి వైద్యకి ఫోటో షూట్ ఏర్పాటు చేసారని.. దాదాపుగా ఈ అమ్మాయినే ఫైనల్ చేసినట్టు సమాచారం. జనవరి నెలాఖరు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు. మరి. ఈ సినిమాతో అయినా.. అఖిల్ ఆశించిన విజయం సాధిస్తారని.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సాధిస్తారని ఆశిద్దాం.
Must Read ;- ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా!