గ్లామర్ డాల్ రష్మికకు వంటల్లోనూ మంచి పట్టుందండోయ్. పుట్టు చికెన్ కూరను ఇట్టే వండేసిందామె. మెగా కోడలు ఉపాసన ప్రారంభించిన యువర్ లైఫ్ గురించి తెలిసిందే కదా. మొన్నటిదాకా సమంత గెస్ట్ ఎడిటర్ గా ఉండి తనదైన స్టయిల్ తో అలరించింది. ఆమె స్థానాన్ని భర్తీ చేయడానికి మరో స్టార్ హీరోయిన్ ను ఉపాసన కొణిదెల పిలుచుకొచ్చారు. ఆమె మరెవరో కాదు గోల్డెన్ లెగ్ రష్మిక మందన్న. మరి ఈ గెస్ట్ ఎడిటర్ ఏమేం చేసిందన్న ఆసక్తి సహజమే కదా. పలు రకాల వీడియోలను రష్మిక చకచకా చేసేస్తోంది.

తను ఎలాంటి ఆరోగ్య సూత్రాలు తీసుకుంటుందో చెబుతూనే మంచి మంచి రుచులను కూడా చూపించేస్తోంది. అలాంటి రెసిపీలలో పుట్టు చికెన్ కూర ఒకటి. తాజా చికెన్ తో కోలీ పుట్టు కూర వండటమే కాదు ఉపాసనకు దాని రుచి కూడా చూపించింది. మరి ఆ వంటకానికి మార్కులు వేయాలి కదా.. అందుకే ఉపాసన వందకు వంద మార్కులు ఇచ్చేసింది. ఆమె నటి మాత్రమే కాదు చెఫ్ గానూ రాణిస్తుందంటూ కితాబిచ్చింది.
అంతే కాదండోయ్ రష్మికకు ఇంకా పెళ్లి కాలేదు కదా.. ఆ విషయాన్ని చెబుతూనే మంచి వంట చేసే భార్య కోసం ఎవరైనా చూస్తుంటే రష్మిక మంచి ఆప్షన్ అంటూ తన స్టయిల్ లో జోక్ కూడా పేల్చేసింది. ఉపాసన మాట విని ఎవరైనా ట్రైచేసుకుంటే మాత్రం మాకేం సంబంధం లేదు. రష్మిక, ఉపాసన సరదా సంభాషణలో ఉన్న వీడియో ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతోంది.
Must Read ;- ఒకేసారి బావ బామ్మర్దులతో రష్మిక రొమాన్స్ .. !











