‘పవర్ స్టార్’ సినిమా విడుదలైతే ఎంత వసూలు చేసిందన్న ఆసక్తి అందరిలోనూ సహజం. ఎందుకో తెలియదుగానీ ఈసారి ఈ సినిమా కలెక్షన్ల విషయంలో గుంభనంగా వ్యవహరిస్తున్నారు.
వకీల్ సాబ్ తొలిరోజు కలెక్షన్ల విషయంలో నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టాలన్న లక్ష్యం ఉంది. కాకపోతే దీనికి ప్రభుత్వం అడ్డుకోవడం వల్ల సాధ్యం కాలేదు. టిక్కెట్ రేటు పెంచుకోడానికి అవకాశం కల్పించి ఉంటే సునాయాసంగా నాన్ బాహుబలి రికార్డును ‘వకీల్ సాబ్’ కొల్ల గొట్టి ఉండేది. ఇప్పుడు అలాంటి అవకాశం లేకపోవడంతో అసలు కలెక్షన్ల వివరాలను బహిర్గతం చేయవద్దని నిర్మాత దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్లను కోరినట్టు ఓ వార్త హల్ చల్ చేస్తోంది.
కచ్చితంగా ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరుతుందన్నది వాస్తవం. కాకపోతే మొదటిరోజు కలెక్షన్ల రికార్డును తిరగరాయడం మాత్రం సాధ్యం కాలేదు. మనకు అందిన సమాచారం ప్రకారం వరల్డ్ వైడ్ గా రూ. 36.46 కోట్ల షేర్ ను ఈ సినిమా వసూలు చేసింది. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ నటించిన ‘అజ్ఞాతవాసి’ వసూళ్ల కన్నా ఇది తక్కువే. దానికి కారణం బెనిఫిట్ షోలు వేయకపోవడమే. అజ్ఞాతవాసి సినిమా రూ. 39.2 కోట్ల షేర్ సాధించింది.
Vakeel Saab movie collection
నాన్ బాహుబలి రికార్డు సాధ్యం కాదా?
నాన్ బాహుబలి రికార్డును బ్రేక్ చేయడం కూడా సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. దానికి కారణం తెలుగు సినిమా పరిధి పెరిగి పాన్ ఇండియా సినిమాగా మారడమే. ‘సాహా’ సినిమా మొదటి రోజు 125. 7 కోట్ల గ్రాస్ సాధించింది. ఇది షేర్ గా చూస్తే 73. 58 కోట్లు ఉంది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ మొదటిరోజు కలెక్షన్ రికార్డు 81.4 కోట్ల గ్రాస్ గా ఉంది. రూ. 51.88 కోట్ల షేర్ ను సైరా సినిమా మొదటి రోజు సాధించింది. ఆ తర్వాత స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ ఉంది. గత ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా మొదటి రోజు 33.38 కోట్ల షేర్ సాధించింది. అలా చూస్తే దీని గ్రాస్ 53 కోట్లుగా ఉంది.
మొదటివారంలోనే ఈ సినిమా 83.33 కోట్ల షేర్ సాధించింది. అల్లు అర్జున్ సినిమా అల వైకుంఠపురములో మొదటివారం 101. 72 కోట్ల షేర్ వసూళ్లు సాధించింది. గ్రాస్ గా చూస్తే ఇది 129.8 కోట్లుగా ఉంది. ఆ రికార్డు ఇప్పుడు సాధ్యమవుతుందా? అన్న సందేహం నెలకొని ఉంది. సినిమా పరంగా చూస్తే ‘వకీల్ సాబ్’ విజయవంతమైంది. కానీ కలెక్షన్ల పరంగా మాత్రం ఏ రేంజ్ లో ఉంటుందన్నది మరో రెండు మూడు రోజుల్లో తేలిపోతుంది. పైగా ఇప్పుడు కరోనా సమయం.. దానికి తోడు ఏపీ ప్రభుత్వం నుంచి ఏర్పడిన ప్రతిబంధకాలు అదనపు రాబడికి బ్రేకులు వేశాయి. మూడు రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ ను ఈ సినిమా సునాయాసంగా అధిగమిస్తుంది.
భారీగా ప్రీరిలీజ్ బిజినెస్
‘వకీల్ సాబ్’ ప్రీరిలీజ్ బిజినెస్ భారీగానే ఉంది.దాదాపు రూ. 89 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం. మొత్తం 90 కోట్ల షేర్ వసూలు చేస్తే సినిమా హిట్ రేంజ్ కు వెళ్లినట్టే. ప్రస్తుతం బ్రేక్ ఈవెన్ ను ఈ సినిమా ఈజీగానే సాధించేసింది. రికార్డుల పరంగా చూసినప్పుడు తొలిరోజు రికార్డు విషయంలో వెనకబడి ఉండటం చిత్ర యూనిట్ లో అసంతృప్తిని మిగిల్చింది. ప్రభుత్వం మీద అభిమానులు ఇంత గుర్రుగా ఉండటానికి కారణం ఇదే. ‘పింక్’ రికార్డులతో దీన్ని పోల్చలేం. పవర్ స్టార్ సినిమా కాబట్టి ఆయన స్టామినాను దృష్టిలో ఉంచుకుని కలెక్షన్లను అంచనా వేయాల్సిందే.
నాన్ బాహుబలి రికార్డును కొల్లగొట్టాలంటే అది పవర్ స్టార్ వల్లే సాధ్యం. కానీ ఆ అవకాశం లేకుండాపోయింది. కనీసం మహేష్ బాబు సాధించిన రికార్డును కూడా అధిగమించలేకపోయింది. పైగా పోటీలో మరో సినిమా ఏదీ లేదు. వచ్చే వారం కూడా ఏ సినిమా బరిలో నిలిచే అవకాశం కనిపించడం లేదు. అలా చూసినప్పుడు ‘వకీల్ సాబ్’ కలెక్షన్లు కుమ్ముకోడానికి రెండు వారాల టైమ్ దొరికింది. ఈ రెండు వారాల్లో అల వైకుంఠపురం సాధించిన రికార్డును అధిగమిస్తోందో లేదో చూడాలి. అలవైకుంఠపురం రెండు వారాల్లో 133.76 కోట్ల షేర్ సాదించింది. ఇది గ్రాస్ పరంగా చూస్తే 213.5 కోట్లు ఉంది.
Vakeel Saab movie collection :
అదే సరిలేరు నీకెవ్వరు విషయానికి వస్తే రూ. 99.94 కోట్ల షేర్ మాత్రమే ఉంది. ఇప్పుడు వకీల్ సాబ్ ముందున్న లక్ష్యం అలవైకుంఠపురమా?, సరిలేరు నీకెవ్వరా? అనేది చూడాలి. ఇప్పుడున్న వాతావరణం ప్రకారం చూస్తే సునాయాసంగా అలవైకుంఠపురములో రికార్డును అధిగమించే అవకాశం ఎక్కువ ఉంది. కరోనా కనికరిస్తే పవర్ స్టార్ కు అదేమంత పెద్ద లక్ష్యం కాదు. అసలు ఇలాంటి వాతావరణంలో వకీల్ సాబ్ విడుదలవడం, ఇంత వసూళ్లూ సాధించడం చిన్న విషయం ఏమీ కాదు. కలిసొచ్చే రోజొస్తే కలెక్షన్లు ఇలాగే నడిచొస్తాయనడానికి వకీల్ సాబే ఓ నిదర్శనం.
– హేమసుందర్ పామర్తి
Must Read ;- విజయోత్సాహంలో ‘వకీల్ సాబ్’ జరీనా