జీహెచ్ఎంసీ ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. వివిధ పార్టీలు తమ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్లకు గడువు నిన్నటితోనే ముగిసింది. దాఖలైన నామినేషన్ల పరిశీలన ఈ రోజు జరుగుతుంది. ఉపసంహరణకు రేపటితో గడువు ముగుస్తోంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, టీజెఎస్, వామపక్షాలు, ఎంఐఎం, టీడీపీ, ఇతర పొలిటికల్ పార్టీల నుండి నామినేషన్లు దాఖలు చేసిన వారి సంఖ్య భారీగానే ఉంది. నిన్న చివరి రోజు కావడంతో చివరి నిముషం వరకు కూడా నామినేషన్లు వేశారు. టిక్కెట్ రాని వారు అప్పటికప్పుడే ఇతర పార్టీల నుంచి బి-ఫామ్ తీసుకుని నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి టిక్కెట్ ఆశించి రాని వారు చాలా మంది తెలంగాణ జనసమితి, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో చేరి బీ ఫామ్ తీసుకుని నామినేషన్లు వేశారు.
Also Read ;- అది దీపావళి కానుకనా? జీహెచ్ఎంసీ ఎన్నికల తాయిలమా?
2,602 నామినేషన్లు…
నిన్న చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా పెరిగాయి. మొత్తం 1932 మంది అభ్యర్థులు 2602 నామినేషన్లు దాకలు చేశారు. 150 సీట్లకు మొత్తం 1932 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. శుక్రవారం ఒకరోజే 1412 మంది అభ్యర్థులు 1937 నామినేషన్లు వేశారు. ఇందులో బీజేపీ నుంచి నామినేషన్ వేసినవారు 571 మంది, టీఆర్ఎస్ నుండి 557 మంది, సిపిఐ(ఎం) నుండి 22, కాంగ్రెస్ నుండి 372, సిపిఐ నుండి 21, ఎంఐఎం నుండిఆ 78, టీడీపీ నుండి 206, గుర్తిపంపు పొందిన, రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీల నుండి మరో 115 మంది, ఇండిపెండెంట్ అభ్యర్థులు 650 మంది నామినేషన్లను దాఖలు చేశారు. ఆదివారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు. దాఖలైన నామినేషన్లను అధికారులు నేడు పరిశీలిస్తారు. టిక్కెట్లు ఆశించి బంగపడ్డవారు రెబల్ గా నామినేషన్లు వేశారు. వీళ్లను బుజ్జగించి వేసిన నామినేషన్లు ఉపసంహరించుకునే పనిలో ఆయా పార్టీలు నిమగ్నమయ్యాయి.
Must Read ;- జీహెచ్ఎంసీ మేయర్ పీఠం కోసం రోడ్డెక్కిన మంత్రి కేటీఆర్!