రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్ ఆర్ ఆర్‘ పైనే అందరి దృష్టి ఉంది. ఎన్టీఆర్ – చరణ్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్న ఈ పాన్ఇండియా మూవీపై అందరిలోనూ అంతకంతకూ ఆత్రుత పెరిగిపోతోంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. క్లైమాక్స్ దృశ్యాలుగా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఏ సన్నివేశమైనా పెర్ఫెక్ట్ గా వచ్చేవరకూ రాజమౌళి కసరత్తులు చేస్తూనే ఉంటారు .. చేయిస్తూనే ఉంటారు. తాజాగా బయటికి వచ్చిన ఒక వీడియో ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది.
‘ఆర్ ఆర్ ఆర్’లో కొమరం భీమ్ గా ఎన్టీఆర్ .. అల్లూరి సీతారామరాజుగా చరణ్ కనిపించనున్నారు. ఇద్దరూ కూడా బానిస బంధాల నుంచి విముక్తి కోసం పోరాడినవారే .. తిరుగుబాటు గళాలను వినిపించినవారే. అలాంటివారి కోసం ఆనాటి పోలీసు బలగాలు అడవులను జల్లెడ పట్టాయి. వాళ్లపై తుపాకులు ఎక్కుపెట్టాయి. ఆ నేపథ్యంలోని సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పటి వీడియో ఇది. అక్కడి వాళ్లంతా ఎంతటి అంకితభావంతో టీమ్ వర్క్ చేస్తున్నారనేది ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.
విప్లవకారుల నేపథ్యంలో జరిగే కథ కావడం వలన .. దేశభక్తిని ప్రేరేపించే సినిమా కావడం వలన, యాక్షన్ సన్నివేశాలు .. డైలాగ్స్ ప్రధానమైన పాత్రను వహించనున్నాయి. ప్రతి యాక్షన్ ఎపిసోడ్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుందని అంటున్నారు. ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ .. అటు చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాలో, అజయ్ దేవగణ్ .. అలియా భట్ కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ ఏడాదిలో ఈ సినిమా సంచలనాన్ని సృష్టించడం ఖాయమనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు.
Must Read ;- క్లైమాక్స్ షూటింగులో రాముడు భీముడు
Everything has to go hand in hand 🤝 especially when prepping up for a shot this MASSIVE! #RRRDiaries #RRRMovie #RRR pic.twitter.com/NX10cvnfjK
— RRR Movie (@RRRMovie) February 18, 2021