మలైకా అరోరా, అర్భాజ్ ఖాన్ వీరిద్దరూ 1998లో పెళ్లి చేసుకున్నారు. తొమ్మిదేళ్ల పాటు వీరి బంధం బాగానే ఉంది. ఆతర్వాత మనస్పర్ధలు వచ్చాయి. ఈ గొడవలు ముదరడంతో ఆఖరికి అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయింది. వీరిద్దరూ 2017లో విడాకులు తీసుకున్నారు. ఆతర్వాత మలైకాకు బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీకఫూర్ తనయుడు అర్జున్ కపూర్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.
గత కొంత కాలంగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. వార్తల్లో నిలుస్తున్నారు. వీరి గురించి వార్తలు వచ్చినా ఎలాంటి స్పందన లేదు. లాక్ డౌన్ టైమ్ లో వీరిద్దరు ఒకే ఇంట్లో ఉన్నారట. బాలీవుడ్ మీడియా ఎప్పటికప్పుడు ఈ జంట గురించి బయటపెడుతుండడంతో బాలీవుడ్ లో హాట్ కఫుల్ అయిన ఈ జంట హాట్ టాపిక్ గా మారారు. ఇటీవల గోవా వెళ్లి న్యూయర్ ని సెలబ్రేట్ చేసుకున్నారు.
ఆ ఫోటోలు బయటకు వచ్చి నెట్టింట్లో సందడి చేశాయి. ఇలా వీరి ఫోటోలు బయటకు వచ్చిన ప్రతిసారీ వార్తల్లో నిలుస్తున్నారు. దీంతో వీరిద్దరూ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారా అని మలైకా అభిమానులతో పాటు కొంత మంది బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే.. ఈ సమ్మర్ లో ఈ హాట్ కఫుల్ పెళ్లి చేసుకోనున్నారని తెలిసింది. మరి.. ఈ జంట పెళ్లి వార్త ఎనౌన్స్ చేస్తారో.? లేక పెళ్లి చేసుకున్న తర్వాత ఎనౌన్స్ చేస్తారో.?