కరోనా కారణంగా థియేటర్లు మూతపడడంతో.. ఇప్పుడు అంతా ఓటీటీ, ఏటీటీలే. చిన్న సినిమాలకు వీటి వలన ఎంతో మేలు జరుగుతుందని చెప్పచ్చు. అయితే.. థియేటర్లు ఓపెన్ చేసుకోవడానికి.. టిక్కెట్ రేట్టు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ.. అంతా మామూలు అయి జనాలు థియేటర్స్ కి రావడానికి టైమ్ పడుతుంది. అయితే.. ఇప్పుడు ధియేటర్లతో సంబంధం లేకుండా ఓటీటీ, ఏటీటీ సంస్థలు పుట్టుకొస్తున్నాయి. ఎఫ్ఎమ్ అనే ఏటీటీ సంస్థ డిసెంబర్ 18న స్టార్ట్ కానుంది. ఎఫ్ ఎమ్ అంటే ఫ్రైడే మూవీస్ అని అర్ధం.
ఈ ఎఫ్ఎమ్ లో ప్రతి వారం కొత్త సినిమాలను రిలీజ్ చేస్తుంటుంది. ఇదిలా ఉంటే… అక్కినేని ఫ్యామిలీ కూడా ఓటీటీ ప్లాన్ చేసే పనిలో ఉందని వార్తలు వస్తున్నాయి. అక్కినేని సమంత మదిలో ఈ ఆలోచన ఉందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆహా కోసం సమంత రంగంలోకి దిగి సామ్ జామ్ అనే పొగ్రామ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన లభిస్తుంది. సమంతకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ తెలిసిందే. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ రోజురోజుకు తన ఫాలోవర్స్ ను పెంచుకుంటూ దూసుకెళుతుంది.
అయితే.. సమంత, చైతన్య కలిసి ఓ నిర్మాణ సంస్థ స్టార్ట్ చేసి వరుసగా సినిమాలు చేయాలి అనుకున్నారు. ఇప్పుడు ఆ ఆలోచనను పక్కన పెట్టి ఓటీటీ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. భారీ స్ధాయిలో అక్కినేని ఓటీటీ స్టార్ట్ చేసి.. దానిని అందరికీ చేరువ చేయాలి అనుకుంటుందట సమంత. ఓ వైపు సినిమాల్లో, వెబ్ సిరీస్ ల్లో నటిస్తూనే మరో వైపు బిజినెస్ లో కూడా రాణిస్తుంది. ఇప్పుడు ఓటీటీ రంగంలోకి కూడా ఎంట్రీ ఇవ్వాలనుకుంటుందట. తన పై వచ్చిన వార్తల పై ఎప్పటికప్పుడు స్పందించే సమంత.. ప్రచారంలో ఉన్న ఈ వార్తల పై స్పందిస్తుందేమో చూడాలి.
Must Read ;- వెబ్ సిరీస్ లో నటించనున్న బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో











