ప్రముఖ కమెడియన్ సునీల్ హీరోగా ఆ మధ్య కాలంలో ‘వేదాంతం రాఘవయ్య’సినిమా అనౌన్సమెంట్ వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. లోగడ ఇదే బ్యానర్ లో వరుణ్ తేజ్ తో ‘గద్దలకొండ గణేష్’సినిమా డైరెక్ట్ చేసిన ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, వేదాంతం రాఘవయ్య సినిమాకి మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంతే కాదు వేదాంతం రాఘవయ్య స్క్రిప్ట్ కూడా హరీష్ శంకర్ సమకూరుస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రానికి డైరెక్టర్ ఫైనలైజ్ అయ్యారు.
గతంలో శర్వానంద్ హీరోగా ‘రాధ’ సినిమా డైరెక్ట్ చేసిన చంద్రమోహన్ ని వేదాంతం రాఘవయ్య కి దర్శకుడిగా ఎంచుకున్నారు . రాధ సినిమాలో శర్వానంద్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. పోలీస్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన రాధ సినిమా ప్లాప్ అయింది. ఆ సినిమా వచ్చి రెండేళ్ల పైనే అయింది. ఇప్పుడు ఆ దర్శకుడితోనే ‘వేదాంతం రాఘవయ్య’ సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉందని తెలుస్తోంది. కలర్ ఫోటోలో విలన్ గా నటించి మంచి మార్కులు తెచ్చుకున్న సునీల్ వేదాంతం రాఘవయ్య సినిమాతో హీరోగా మరో ప్రయోగం చేయాలనుకుంటున్నారు. కొత్త ఏడాది ఈ సినిమా ప్రారంభమవుతుందిన తెలుస్తోంది. ‘రాధ’ వచ్చి రెండేళ్ల పైనే అయింది. ఇప్పుడు ఆ దర్శకుడితోనే ‘వేదాంతం రాఘవయ్య’ సినిమా స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉంది.
Must Read ;- లేటెస్ట్ ఫోటోస్ తో మెస్మరైజ్ చేస్తోన్న అందాల సమంత