మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ ఏర్పడడంతో ఈసారి ఎన్నికల సీన్ గతంతో పోలిస్తే మరింత రసవత్తరంగా జరగనున్నాయి అనిపిస్తుంది. అయితే.. మా అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజ్ పోటీ చేస్తుండడంతో ఎన్నడూ లేనిది నాన్ లోకల్ వెర్సెస్ లోకల్ అనేది తెర పైకి వచ్చింది. ఈ విషయం పై ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ పెట్టి మరీ.. తన వాదన వినిపించారు. తెలంగాణలోనే నివాసం ఉంటున్నాను. ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నాను. తన ఆధార్ కార్డ్ లో ఇక్కడ అడ్రసే ఉంది. అలాంటి ఎప్పుడూ లేనిది ఇప్పుడే నాన్ లోకల్ అనడం ఏంటి అంటూ తన వాదన వినిపించారు.
ప్రకాష్ రాజ్ కి చిరంజీవి మద్దతు ఉందని మెగా బ్రదర్ నాగబాబు ప్రెస్ మీట్ లో ప్రకటించారు. అంతే కాకుండా.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఒకసారి మెంబర అయితే.. ఏ పోస్ట్ కి అయినా పోటీ చేసే అర్హత ఉంటుందన్నారు నాగబాబు. ఇదిలా ఉంటే.. ప్రకాష్ రాజ్ ని నాన్ లోకల్ అనడం పై వర్మ ట్విట్టర్ లో స్పందిస్తూ…ఈ విధంగా ట్వీట్ చేశారు.
అతని నటన చూసి @prakashraaj నాలుగు సార్లు ఈ దేశం అతన్ని శాలువా కప్పి national award తో సత్కరిస్తే , calling him non local …it’s a comment against india
మీరందరూ ప్రేమించే హీరోయిన్స్ అందరూ non లోకల్ .. మైఖేల్ జాక్సన్ నాన్ లోకల్ .. bruce lee non local..రాముడు సీత కూడా నాన్ లోకల్ ..
@prakashraaj also Non Local
కర్ణాటక నించి AP కి వచ్చిన @prakashraaj నాన్ లోకల్ అయితే, మహారాష్ట్ర నుండి ఎక్కడెక్కడికో వెళ్ళిన రజనీకాంత్ గారు, ఉత్తర ప్రదేశ్ నుంచి మహారాష్ట్ర కి వెళ్ళిపోయిన అమితాబ్ బచ్చన్ గారు లోకలా ??? ఎలా ? ఎలా ? ఎలా ?
ముప్పై ఏళ్లుగా @prakashraj ఇక్కడే ఉండి తెలుగు నేర్చుకొని , చలం పుస్తకాలని మళ్ళీ తనే ముద్రించి , పెళ్ళాం పిల్లలతో ఇక్కడే ఉంటూ , తెలంగాణ లో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని , అక్కడున్న ఎంతో మంది ఆడవాళ్ళకి పని కల్పిస్తున్న వాడు నాన్ localaa???
కర్ణాటక నించి ఆంధ్రప్రదేశ్ వచ్చిన @prakashraaj నాన్ లోకల్ అయితే, గుడివాడ నించి చెన్నైకి వెళ్లిన రామారావుగారు, నాగేశ్వరరావుగారు …బుర్రిపాలెం నించి మద్రాస్ వెళ్లిన కృష్ణగారు,తిరుపతి నించి మద్రాస్ బయల్దేరిన మోహనబాబు గారు లోకలా ??? ఎలా ఎలా ఎలా..
ఈ విధంగా వర్మ ట్వీట్ చేసి తన సపోర్ట్ ప్రకాష్ రాజ్ కే అనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. ఇక్కడ ప్రకాష్ రాజ్ కి వర్మ సపోర్ట్ చేస్తుండడం కన్నా.. చిరంజీవి మద్దతు ఇస్తున్న ప్రకాష్ రాజ్ కి వర్మ సపోర్ట్ చేయడం నిజంగా షాకింగే.
Must Read ;- మా ఏకగ్రీవ సంప్రదాయం ఏమైంది?