ఇండియన్ స్ర్కీన్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ఇటీవల ముంబైలో దాదాపు రూ. 33కోట్ల విలువైన డూ ప్లెక్స్ బిల్డింగ్ కొనుగోలు చేయడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 5,184 అడుగుల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ బిల్డింగ్ లో .. ఆరు కార్ పార్కింగ్స్ ఉన్నాయి. ఈ బిల్డింగ్ ను బిగ్ బీ గత డిసెంబర్ లో కొనుగోలు చేసినప్పటికీ.. ఈ నెల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తయింది.
ప్రముఖ బిల్డింగ్ సంస్థ క్రిష్టల్ గ్రూప్ ఈ బిల్డింగ్ నిర్మించింది. బహుళ అంతస్తుల ఈ బిల్డింగ్ లో అమితాబ్ కొన్న డూప్లెక్స్ 27, 28 ఫ్లోర్స్ లో ఉంది. ఇక ఇదే బిల్డింగ్ లో బాలీవుడ్ క్రేజీ హాట్ స్టార్ సన్నిలియోన్ కూడా ఇంటిని కొనుగోలు చేసింది. ఇలా ఒకే బిల్డింగ్ లో బిగ్ బీ బచ్చన్ సాబ్, సన్నిలియోన్ నివసించడం బాలీవుడ్ లో చర్చనీయాంశమైంది.
Must Read ;- కొత్త పాపలో ఈ హాట్ యాంగిల్ ఏమిటో ?