మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం సోలో బ్రతుకే సో బెటర్. ఈ చిత్రానికి నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహించారు. భారీ చిత్రాల నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రావాలి కానీ.. కరోనా కారణంగా ఆగింది. ఆఖరికి అన్ని అడ్డంకులను దాటుకుని ఈ రోజు ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రం రిలీజైంది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కరోనా తర్వాత రిలీజ్ అవుతున్న ఫస్ట్ మూవీ కావడంతో సినీ ప్రముఖులు అంతా ఈ సినిమాని ఎంతగానో ప్రమోట్ చేస్తున్నారు.

ఇండస్ట్రీ అంతా ఈ సినిమా సక్సస్ సాధించాలని కోరుకుంటుంది. అందరూ కోరుకుంటున్నట్టుగానే ఈ సినిమా సక్సస్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే మార్నింగ్ షో కలెక్షన్స్ విషయానికి వస్తే.. నైజాం – 30.75 లక్షలు, వైజాగ్ – 11.5 లక్షలు, గుంటూరు – 8.06 లక్షలు, కృష్ణ – 5.11 లక్షలు, ఈస్ట్ – 7.04 లక్షలు, నెల్లూరు – 5.03 లక్షలు, సీడెడ్ – 17.74 లక్షలు, వెస్ట్ – 6.14 లక్షలు మొత్తం – 91.37 లక్షలు సాధించింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అఫిషియల్ గా ఎనౌన్స్ చేసింది.
క్రిస్మస్ హాలీడేస్ అండ్ వీకెండ్ కాబట్టి రోజురోజు మరిన్ని కలెక్షన్స్ పెరుగుతాయని టీమ్ గట్టి నమ్మకంతో చెబుతుంది. మరి.. ఫస్ట్ వీకెండ్ కి ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.
Must Read ;- సోలో బ్రతుకే సో బెటర్ తో థియేటర్లు మళ్లీ కళ కళ











