కొందరు ముద్దుగుమ్మలు ఏదో అమృతం తాగినట్టు .. వయసు మీద పడుతున్న కొద్దీ ఇంకా యవ్వనంలోకి వెళ్ళిపోతారు. కాలంతో సంబంధం లేనట్టు అందంతో మెరిసి పోతుంటారు. అలాంటి వారి లిస్ట్ లోకి చేరాల్సిన బ్యూటీ విమలారామన్. చంద్రబింబం లాంటి ముఖం, చక్రాల్లాంటి కళ్ళు, శంఖం లాంటి మెడ.. విల్లులా వంగే ఒళ్లు .. ఉన్నట్టా లేనట్టా అన్నట్టుగా నడుము.. విమలా రామన్ ప్రత్యేకతలు. ఎల్లప్పుడూ చిరునవ్వును దొండపళ్ళలాంటి పెదవులకు అలంకరిస్తూ .. భలేగా ఆకట్టుకుంటుంది.
బెంగళూరు లోని తమిళ ఫ్యామిలీకి చెందిన విమలారామన్ .. ఎప్పుడో 15 ఏళ్ళ క్రితం .. ‘పొయ్’ అనే తమిళ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత వరుసగా మలయాళ చిత్రాల్లో నటించి సత్తా చాటుకుంది. ఆపై .. ఎవరైనా ఎపుడైనా, గాయం 2, రంగ ది దొంగ, రాజ్ , చట్టం, కులుమనాలి, నువ్వా నేనా లాంటి తెలుగు సినిమాల్లో గ్లామరస్ గా మెరిసింది. అలాగే.. నాగార్జున ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రంలో ఒక చక్కటి పాత్రను కూడా పోషించింది. ఇక విమలా రామన్ ఆఖరుగా నటించింది ‘ఇరుట్టు’ తమిళ సినిమాలో.
గతేడాది, ఈ ఏడాది విమలా ఒక్క సినిమాలోనూ నటించలేదు. అయినప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులతో ఎప్పుడే టచ్ లోనే ఉంటుంది. లేటు వయసులో ఘాటైన అందాలతో . నెటిజెన్స్ ను మత్తెక్కిస్తూంటుంది. లేటెస్ట్ గా విమలారామన్ షేర్ చేసిన శారీ పిక్స్ .. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. లైట్ పింక్ కోక మీద నీలం రంగుల చుక్కల రైక తొడిగిన విమలా రామన్.. మిసమిసలాడిపోతోంది. దానికితోడు ఆ మెడకి చక్కగా అమరిపోయేలా .. పెద్ద తాయెత్తులాంటి లాకెట్ ధరించింది. ప్రస్తుతం ఈ పిక్స్ కు మంచి స్పందన లభిస్తోంది.
Must Read ;- టాలీవుడ్ లో టాప్ గేరేసిన బాలీవుడ్ బ్యూటీ