టాలీవుడ్ సీనియర్ నటీమణి ప్రగతి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. 40 ప్లస్ వయసులో కూడా తన అందాన్ని, అలాగే.. తన శరీరాన్ని చాలా జాగ్రత్తగా మలచుకుంటూ వస్తోంది. ఖాళీ టైమ్ లో బాడీ ఫిట్ నెస్ కు ఎంతో ప్రధాన్యత ఇస్తూ..ఆ వయసులో ఇతరులకు సాధ్యంకాని విన్యాసాల్ని చేసేస్తూ ఉంటుంది. స్కిప్పింగ్, వెయిట్ లిఫ్టింగ్, యోగా, డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ.. ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూంటుంది. తరచుగా సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే వీడియోలు, ఫోటోలు నెటిజెన్స్ ను ఆశ్చర్యపరుస్తుంటాయి.
భాగ్యరాజా తమిళ సినిమా ‘వీట్టిల్ విశేషంగల్’ సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది ప్రగతి. ఆ సినిమా తెలుగులో ‘గౌరమ్మా నీ మొగుడెవరమ్మా’ గా విడుదలై.. ఇక్కడ కూడా బాగా ఆడింది. ఆ తర్వాత కొన్ని సౌత్ సినిమాల్లో నటించినప్పటికీ ఆమెకి కథానాయికగా సరైన గుర్తింపు రాలేదు. ఆ తర్వాత కొన్నేళ్ళు గ్యాపిచ్చి.. కేరక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. అమ్మగానూ, వదినగానూ, అత్తగారి గానూ, ఇలా రకరకాల పాత్రలు పోషిస్తూ సత్తా చాటుకుంటోంది. ఎక్కువగా తనలోని కామెడీ యాంగిల్ ను కూడా బైట పెడుతుంటుంది ప్రగతి.
ఆ మధ్య ఎప్పుడో ఓ పాటకి డాన్స్ చేసి ఇన్ స్టాను ఊపేసిన ప్రగతి మేడమ్.. ఇటీవల తమిళ హీరో విజయ్ సాంగ్ కి లుంగి కట్టి.. డ్యాన్స్ ఇరగదీసింది. ఇక తాజాగా ప్రగతి పోస్ట్ చేసిన ఒక వీడియో అందరికీ షాకిస్తోంది. తన ఒళ్ళు ను పూర్తిగా వెనక్కి వంచి.. జిమ్నాస్టిక్స్ తరహాలో ఆమె చేసిన విన్యాసం అబ్బుర పరుస్తోంది. ఈ వయసులో కూడా ఆమె తన శరీరాన్ని అంత ఫిట్ గా ఉంచుకోవడం అనితర సాధ్యమనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Must Read ;- నెత్తిన కొప్పెట్టుకొని ఇన్ స్టాను ఊపేస్తున్న రష్మీ