Sputnik V Vaccine :
కొవిడ్ మహమ్మారి అన్ని దేశాలపై విరుచుకుపడింది. కోట్లాది మంది ప్రాణాలను బలి తీసుకుంది. కొవిడ్ పోరులో వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేశాయి. కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ లాంటి టీకాలు కరోనా బారి నుంచి కాపాడాయి. ఏ టీకా ప్రభావం చూపుతుంది? ఎంతవరకు పని చేస్తుంది? అని అంశాలపై అధ్యయనాలు జరిగాయి. అయితే ఇప్పుడున్న వ్యాక్సిన్లలో అన్నికంటే ఎక్కువ రేటింగ్ ఉన్న టీకా ఏదైనా ఉందంటే.. అది స్పుత్నిక్ అనే చెప్పాలి. ఇది రష్యాలో బాగా సక్సెస్ అయ్యింది. ఎంతోమంది ప్రాణాలను కాపాడింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా స్పుత్నిక్-వీ ఎక్కడా లేని డిమాండ్ ఉంది. అయితే ఇప్పటివరకు మనదేశంతో కోవాగ్జిన్, కోవిషీల్డ్ లాంటి వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇక త్వరలోనే స్పుత్నిక్-వీ రాబోతోంది. రష్యాకు చెందిన స్పుత్నిక్-వీ తయారీకి ఢిల్లీకి చెందిన ఫార్మ సంస్థ పనాసియా బయోటెక్ అనుమతి సాధించింది. ఈ వ్యాక్సిన్ తయారీకి డీసీజీఐ కూడా అనుమతిని ఇచ్చింది. ఈ నేపథ్యంలో స్పుత్నిక్-వీ వ్యాక్సీన్‌ను తయారుచేసే తొలి సంస్థగా తమ కంపెనీ అవతరించిందని పనాసియా ఆదివారం ప్రకటించింది. ఈ టీకా ధర మోతాదు రూ.1,145 గా ప్రభుత్వం నిర్ణయించింది.
కరోనా నివారణలో 91.6 శాతం
కొవిడ్ పోరులో ఇతర వ్యాక్సిన్ల కంటే స్పుత్నిక్-వీ మెరుగ్గా పనిచేస్తోందని పలు సర్వేలు కూడా చెప్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ కు 67 దేశాలలో అనుమతి లభించగా, మొత్తం జనాభా 3.5 బిలియన్లకు పైగా టీకాలను పంపిణీ చేశారు. సాఫ్ట్ లాంచ్‌లో భాగంగా ఇప్పటికే మనదేశంలో కొంతమంది ఈ టీకా తీసుకున్నారు. కరోనా నివారణలో 91.6 శాతం సామర్థ్యాన్ని కలిగి ఉండటంతో ఈటీకా కోసం ఎంతోమంది ఆశగా ఎదురుచూస్తున్నారు.
త్వరలోనే ప్రభుత్వాస్పత్రుల్లో..
ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రుల్లో దొరుకుతున్న స్పుత్నిక్ త్వరలోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అందుబాటులోకి రానుంది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా కోవిడ్-19 వర్కింగ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ఎన్‌కే అరోరా మాట్లాడుతూ త్వరలోనే స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తామని, ఇప్పటివరకు 35 కోట్ల 26 లక్షల 92 వేల, 46 మందికి వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు.
Must Read ;- డెల్టాపై.. కోవాగ్జిన్ భేష్!