పటాస్ శ్రీముఖితో పెట్టుకుంటే మటాషే.. స్టార్ యాంకర్ గురించి రాయాలంటే ఇలాంటి పంచ్ పడాల్సిందే. ప్రేమికుల రోజున ఈ భామ ఏదో వార్త మనకు చెబుతుందట. క్లూ ఇచ్చింది కదా అని ట్రోలర్లు రెచ్చిపోతున్నారు. ‘అక్క బావ గురించి చెబుతుందేమో’ అంటూ కామెంట్లు చేసేస్తున్నారు. అన్నట్టు ఈ భామ ఇటీవలే గోవా వెళ్లి ఆ ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. మంచి హాట్ గా ఆ ఫొటోలు చూసి రెచ్చిపోయి కామెంట్లు చేసేస్తున్నవారూ ఉన్నారు. ఇంతకీ రేపు ఆమె ఏ విషయం గురించి చెబుతుందా అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.

పైగా ఆమె వేసిన డ్రెస్ చూసే ఏదేదో ఊహించేసుకుంటున్నారు. పేపర్ డిజైన్ తో ఉన్న షార్ట్ డ్రెస్ మాత్రం అందరినీ ఆకర్షించేస్తోంది. ఒకప్పుడు సానియా మీర్జా పెళ్లి గురించే అందరూ మాట్లాడుకునేవారు.. ఇప్పుడు మాత్రం ఆ స్థానంలో శ్రీముఖి దొరికింది. ఆమె పెళ్లి ఎప్పుడు లాంటి వార్తలే ఎక్కువగా వస్తుంటాయి. ఈ అక్కకు వరుడు ఎక్కడున్నాడోగానీ నెటిజన్లకు మాత్రం ఆత్రం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం శ్రీముఖి సినిమాలతో బిజీగా ఉంది. మరో పక్క టీవీ షోలు ఆమెకు ఉండనే ఉన్నాయి.

‘క్రేజీ అంకుల్స్’ రిలీజ్ కావలసి ఉంది. కొత్తగా ఏదైనా టీవీ షోకి కమిట్ అయితే ఆ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. లేదా ఏదైనా సినిమాలో అవకాశం వచ్చి ఆ విషయాన్ని పంచుకుని ఉండాలనుకోవచ్చు. చెప్పేది డైరెక్టుగా చెప్పేస్తే పోతుంది. ఇలా ఊరించి ఉబ్బించి ప్రకటించడం ఎంతవరకు సమంజసం? ఇదో పబ్లిక్ స్టంటులా మారిపోయింది. నెటిజన్లు ఆమెను అక్కా అని ఎందుకు సంబోధిస్తుంటారో అర్థం కాదు.
ఈ సోదర ప్రేమ పాళ్లు కాస్త ఎక్కువవుతోంది కూడా. ‘ఇలాంటి డ్రెస్ లు వేసుకోకు అక్కా’ అంటూ ఉచిత సలహాలు కూడా ఇచ్చేస్తున్నారు. అక్కగా చూడటం ఇష్టం లేని వారు హాట్ బ్యూటీ అంటూ కితాబులిచ్చేస్తున్నారు. మరి ఆమెకు ఎవరి కామెంట్లు నచ్చుతున్నాయో. ‘అక్కా.. బావెక్కడ?’ సినిమాలో నటిస్తే చూడాలనుకునే అభిమానులు కూడా ఉన్నారు. బాల్ ఆమె కోర్టులోనే ఉంది కాబట్టి ఆమె చెప్పబోయే విషయం కోసం రేపటిదాకా ఎదురుచూడక తప్పదు.
Must Read ;- స్విమ్ సూట్లో మతిపోగొడుతున్న నిషా కళ్ల బ్యూటీ











