శ్రీముఖి .. ఆకాశం నుంచి జారిపడిన చందమామ .. నేలపై విరిసిన కలువ భామ. మందారం .. మకరందం కలిపిచేసిన బుట్టబొమ్మ. ఆమె కళ్లు వెన్నెల ధారలను కురిపిస్తాయి .. ఆమె చూపులు కుర్ర మనసుల దిశగా ప్రవహిస్తాయి .. ఆమె రూప లావణ్యాలు అప్సరసలకు అసూయ పుట్టిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు ఈ అమ్మాయి ఈ లోకానికి చెందినది కాదేమో అనుకునేంత సౌందర్యరాశి. బంగారు మేనిఛాయతో మెరిసిపోయే శ్రీముఖికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు .. మరెంతో మంది ఆరాధకులు ఉన్నారు.
‘అదుర్స్’ ప్రోగ్రామ్ తో యాంకర్ గా శ్రీముఖి తన ప్రయాణాన్ని ఆరంభించింది. బుల్లితెరపై ఈ అమ్మాయి చేస్తున్న అల్లరి .. సందడి ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. బుల్లితెరపై ఈ అమ్మాయిని చూడగానే కుర్ర హృదయాలన్నీ కూని రాగాలు తీశాయి .. ఊహలన్నీ ఉద్యానవనాలుగా మారిపోయాయి. అందంతో .. అందమైన అల్లరితో అందరి మనసులను దోచుకుంటూ శ్రీముఖి దూసుకుపోవడం మొదలైంది. ‘పటాస్’ ప్రోగ్రామ్ తో ఆమె యూత్ కి మరింత చేరువైంది. ఉప్పెనవంటి ఉత్సాహానికి .. సుడిగాలి వంటి చురుకుదనానికి శ్రీముఖి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది.
Must Read ;- అవినాశ్ వెల్ కమ్ బ్యాక్ పార్టీలో శ్రీముఖి సందడి
బుల్లితెరపై యాంకర్ గా .. పెద్ద పెద్ద ఈవెంట్స్ కి హోస్ట్ గా వ్యవహరిస్తూ, ఆమె అందరి మనసు తెరలను మంచులా అలుముకుంది. దాంతో సహజంగానే సినిమా అవకాశాలు ఆమె డోర్ బెల్ కొట్టాయి. ఒక వైపున బుల్లితెరపై తన స్థానాన్ని కాపాడుకుంటూనే మరో వైపున సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు .. ప్రత్యేకమైన పాత్రలతో పలకరిస్తూ వెళుతోంది. ‘బిగ్ బాస్ 3’ రియాలిటీ షోను శ్రీముఖి కోసమే చూసినవారున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతగా అందరూ ఆమె చిలిపి చూపులకు .. అల్లరి చేష్టలకు .. సరదాల సందళ్లకు అభిమానులైపోయారు.
శ్రీముఖి ఎంత బిజీగా ఉన్నప్పటికీ .. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పటికప్పుడు కనెక్ట్ అవుతూనే ఉంటుంది. తనకి సంబంధించిన విషయాలను .. విశేషాలను వాళ్లతో పంచుకుంటూనే ఉంటుంది. ఇన్ స్టా గ్రామ్ లో శ్రీముఖిని 3.1 మిలియన్ల మంది అనుసరిస్తుండటం విశేషం. కొంచెం చిలిపిగా .. మరికొంచెం కొంటెగా .. ఇంకొంచెం హాట్ గా కనిపిస్తూ, శ్రీముఖి తన అభిమానుల సంఖ్యను అంచెలంచెలుగా పెంచేస్తోంది. ఒక కథానాయికకు ఉండవలసిన లక్షణాలు శ్రీముఖిలో పుష్కలంగా ఉండటం వలన, ఆమె పూర్తిస్థాయిలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మధ్య శ్రీముఖి హాట్ పిక్స్ చూస్తుంటే మాత్రం, అభిమానుల ముచ్చట తీరడానికి మరెంతో కాలం పట్టకపోవచ్చనే అనిపిస్తోంది.
Also Read ;- హనీమూన్ లో మునిగితేలుతోన్న చందమామ