సౌత్ స్ర్కీన్ పై పలువురు సూపర్ హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకొని ఆ తర్వాత దంపతులుగా మారారు. వారిలో ముందు వరుసలో ఉండే జోడీ.. సూర్య, జ్యోతిక. ఈ ఇద్దరూ తమిళంలో ఏడు సినిమాల్లో జంటగా నటించారు. అలా నటిస్తున్నప్పుడే ప్రేమలో పడ్డారు. పెళ్ళితో తమ ప్రేమను పండించుకున్నారు. అయితే సూర్యను పెళ్ళిచేసుకున్నాకా పూర్తిగా గృహిణి గా మారిపోయింది జ్యోతిక సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. అయితే ఇద్దరు పిల్లలు పుట్టినతర్వాత.. వారు కాస్తంత పెద్దవారైన తర్వాత కానీ.. జ్యోతిక తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వలేదు. ఆ విషయంలో ఆమెకు సూర్య ఎలాంటి అడ్డు చెప్పలేదు.
తమ సొంత బ్యానర్ లోనే జ్యోతిక తో సూర్య పలు చిత్రాలు నిర్మించి.. ఆమెను మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కించాడు. రీ ఎంట్రీ లో జ్యోతిక నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీస్ అన్నీ దాదాపు హిట్సే. మహిళ సమస్యల మీద, వారి స్వాతంత్యం, హక్కుల మీదనే చక్కటి కథలు రాసుకొని.. ఆ సినిమాలతో తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగువారినీ అలరించారు. జ్యోతిక నటించిన ఎర్లియర్ మూవీ ‘పొన్ మగళ్ వందాళ్’. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమా తెలుగులో బంగారు తల్లిగా విడదులై.. ఇక్కడా మెప్పించింది.
ఇక త్వరలోనే సూర్య,జ్యోతిక జంట తిరిగి తమిళ తెరపైకి రానున్నారని టాక్ వినిపిస్తోంది. తమ వయసు కు తగ్గ పాత్రలతోనే ఇద్దరూ ఈ సినిమా లో జోడీగా నటించనున్నారట. ఈ ఇద్దరి కోసం మలయాళ దర్శకురాలు అంజలీ మీనన్, తమిళ దర్శకులు హాలిత కలిసి ఓ రాస్తున్నారట. బెంగళూర్ డేస్ మలయాళ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న అంజలీ మీనన్ ఈ సినిమాను బహుభాషల్లో తెరకెక్కిస్తోందట. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్ మెంట్ రానుంది. మరి ఈ సారి ఈ స్టార్ జోడీ ఏ రేంజ్ లో జనాన్ని మెప్పిస్తారో చూడాలి.