September 15, 2026 9:04 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

సాగర్, తిరుపతి ఉప ఎన్నికలు.. అభ్యర్థుల వేటలో అధికార పార్టీలు

తెలంగాణలోని నాగార్జునసాగర్ అసెంబ్లీకి, ఏపీలోని తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది.

March 16, 2021 at 7:18 PM
in Latest News, Politics
ఉప ఎన్నికల షెడ్యూల్ - www.the.leonews.com
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తెలంగాణలోని నాగార్జునసాగర్ అసెంబ్లీకి, ఏపీలోని తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. నోటిఫికేషన్ మార్చి23న వెలువడనుండగా ఎన్నికలు ఏప్రిల్ 17 న జరగనున్నాయి. మే2న ఫలితాలు రానున్నాయి. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (టీఆర్ఎస్), తిరుపతి ఎంపీ దుర్గా ప్రసాద్  (వైసీపీ) మరణంతో ఈ ఉప ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ రెండుచోట్ల అధికార పార్టీల అభ్యర్థులెవరనేది ఇంకా తేలలేదు. తెలంగాణలో ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నాగార్జునసాగర్ అభ్యర్థిగా మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత కుందూరు జానారెడ్డి పేరును ఖరారు చేయగా అధికార టీఆర్ఎస్ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. తిరుపతి లోక్ సభ స్థానానికి ఏపీ ప్రతిపక్ష టీడీపీ తమ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి పనబాక లక్ష్మిపేరును ఖరారు చేసింది. ఇక్కడ అధికార పక్షమైన వైసీపీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. తెలుగు రాష్ట్రాల్లో తామే ప్రత్యామ్నాయంగా మారతామని చెప్పిన బీజేపీ.. ఈ రెండుచోట్లా ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు.

నాగార్జునసాగర్ అభ్యర్థులు..ఆశావహులు

కాంగ్రెస్ నుంచి జానారెడ్డి బరిలోకి నిలిచారు. టీడీపీ కూడా మొవ్వ అరుణ్ కుమార్‌ను బరిలోకి దింపింది. టీఆర్ఎస్ నుంచి నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ యాదవ్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డితో పాటు ఎంసీ కోటిరెడ్డి, రంజిత్ యాదవ్, గురువయ్య యాదవ్, శ్రీనివాస్ యాదవ్, రవీందర్ రెడ్డి రేసులో ఉన్నారు. హాలియాలో సభకు చిన్నపరెడ్డిని కేసీఆర్‌ హెలికాప్టర్‌లో తీసుకురావడంతో ఆయనకే టిక్కెట్ అని ప్రచారం జరిగినా.. సామాజిక సమీకరణాల నేపథ్యంలో మరికొన్ని పేర్లు తెరపైకి వచ్చాయి. సామాజిక వర్గం, స్థానికత, పార్టీ విధేయత, ఆర్థిక బలం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని టీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేయనుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే.. అంజయ్య యాదవ్, కంకణాల శ్రీధర్‌రెడ్డి భార్య నివేదితారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. అంజయ్య యాదవ్ 2019లో టీడీపీని వీడి బీజేపీలో చేరారు. 2014లో ఆయన టీడీపీ తరఫున పోటీచేయగా 27వేల ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీ పొత్తు ఉండడంతో టీడీపీ పోటీ చేయలేదు. బీజేపీ నుంచి నివేదిత రెడ్డి పోటీ చేయగా 2675ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎవరికి టిక్కెట్ ఇస్తుందనే అంశంపై పలు పేర్లు తెరపైకి వస్తున్నాయి. వామపక్షాలు కూడా ఇంకా అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. కాగా 2018ఎన్నికల్లో జానారెడ్డికి 75,884 ఓట్లు రాగా నోముల నర్సింహయ్యకు 83,655ఓట్లు వచ్చాయి. 7,771ఓట్ల మెజార్టీతో నోముల గెలుపొందారు.

Must Read ;- సాగర్ నాది, అంతా నేనే చూసుకుంటా.. జానా ధైర్యం

తిరుపతి అభ్యర్థిత్వంపై వైసీపీ, బీజేపీ మల్లగుల్లాలు

ఇక తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల విషయానికి వస్తే..ఇక్కడ ప్రతిపక్ష టీడీపీ ముందుగానే అభ్యర్థిని ప్రకటించింది. 2019ఎన్నికల్లో ఓడిపోయిన పనబాక లక్ష్మిని ఎంపిక చేసింది. ఇక వైసీపీ కొత్త అభ్యర్థిని నిలపనుంది. ఇప్పటికే బల్లి దుర్గాప్రసాద్ కుమారుడికి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చింది. సీఎం జగన్‌కు సన్నిహితుడు, వైద్యుడైన గురుమూర్తి పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం వైసీపీలో ఈ ఒక్కపేరు మాత్రమే చర్చకు వస్తోంది. ఇక బీజేపీ నుంచి రిటైర్డ్ ఐఎఎస్‌లు, అధికారులైన దాసరి శ్రీనివాసులు, సునిల్ కుమార్ పేర్లతో పాటు రావెల కిశోర్ బాబు పేరు కూడా వినిపిస్తోంది. జనసేన పొత్తు ధర్మం పాటిస్తుందా లేదా అనేది కూడా చర్చనీయాంశంగానే మారింది. ఇప్పటికే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయాలని జనసేన పిలుపునిచ్చింది. తమ పార్టీ శ్రేణుల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించి బీజేపీకి షాక్ ఇచ్చారు. మరి తిరుపతిలో ఏం చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి మూలింటి మారెప్ప భారతీయ ప్రజా కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించగా, కాంగ్రెస్ కూడా రేసులో ఉంటుందని ఆ పార్టీ నేత తులసి రెడ్డి వ్యాఖ్యానించారు.

మున్సిపల్ ఎన్నికల్లో..

కాగా రెండురోజుల క్రితం వచ్చిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా, తిరుపతి లోక్‌సభ పరిధిలోనూ వైసీపీ పైచేయి సాధించింది. ఈ పార్లమెంటు స్థానం పరిధిలో ఉన్న చిత్తూరు జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలు, నెల్లూరు జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ గెలుపొందింది. 2019 ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 13.16లక్షల ఓట్లు పోలయ్యాయి. అందులో వైసీసీ అభ్యర్థి  బల్లి దుర్గాప్రసాద్‌కు 7.22లక్షల ఓట్లు రాగా 2.2లక్షల మెజార్టీతో గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 4.9లక్షల ఓట్లు వచ్చాయి. జనసేన-బీఎస్‌పీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి శ్రీహరిరావుకి 20,971ఓట్లు, బీజేపీ అభ్యర్థి బొమ్మి శ్రీహరి రావుకి 16,125ఓట్లు వచ్చాయి. వైసీపీ, టీడీపీ తరువాత నోటాకు 25,781ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ చింతా మోహన్‌కు 24,039ఓట్లు వచ్చాయి.

Must Read ;- లెక్కలేసుకుంటున్నారు.. తిరుపతి తమదే అంటున్నారు!

Tags: by election candidatesby election trs candidateby elections in andhra pradeshEditorspickelction commision of india latest newselection commision of india updatesjanasena vs tirupathi by electionkcr about nagarjuna sagar by polling jagan about tirupathi by polingleotopnagarjun sagar by electionsnagarjuna sagar by election bjp candidatenagarjuna sagar by election candidatesnagarjuna sagar by election datenagarjuna sagar by election date 2021nagarjuna sagar by election trs candidatenagarjuna sagar updatesnagarjuna sager by pollingnagarjuna sagr by election datesrevanth reddy about sagar by electionsruleing parties on by electionruling paties searching for candidates in sagar and tirupatitdp about tirupathi by electiontelugu newstirupathi by election updatestirupathi by electionsycp discussion on tirupathi by election
Previous Post

వెల్ఫేర్ హాస్టల్లో కరోనా కలకలం.. 38 మంది విద్యార్థులకు వ్యాధి

Next Post

అధిష్టానం కిరి కిరి.. అయ్యో పాపం అర్వింద్!

Related Posts

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

by లియో డెస్క్
September 14, 2026 6:50 pm

ఆంధ్రప్రదేశ్‌లో సొంతిల్లు లేని నిరుపేదలకు కూటమి ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్పనుంది. అర్హులైన...

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

by లియో డెస్క్
September 13, 2026 5:35 pm

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ...

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

by లియో డెస్క్
September 12, 2026 7:12 pm

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతూ వస్తుండటంతో నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌...

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

by లియో డెస్క్
September 12, 2026 5:49 pm

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో టీచర్‌ ఉద్యోగాలు దక్కించుకున్న వారి జీవితాలు...

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

by లియో డెస్క్
September 12, 2026 3:50 pm

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆస్తులపై మాజీ మంత్రి కొడాలి...

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

by లియో డెస్క్
September 11, 2026 5:33 pm

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కార్యకర్తల సమావేశంలో...

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

by లియో డెస్క్
September 11, 2026 4:13 pm

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి పేరు కేవలం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదని,...

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

by లియో డెస్క్
September 10, 2026 5:11 pm

కూటమి ప్రభుత్వం పారదర్శకంగా చేపడుతున్న మెగా DSC ఉపాధ్యాయ నియామకాలను అడ్డుకోవాలని చూస్తున్న...

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

by లియో డెస్క్
September 9, 2026 7:21 pm

ఉత్తరాంధ్ర రాజకీయం మారుతోంది. ఉమ్మడి విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు జడ్పీ ఛైర్మన్‌...

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

by లియో డెస్క్
September 9, 2026 5:29 pm

రాజకీయ కక్షసాధింపు చర్యలు ఏ స్థాయికి దిగజారతాయో చెప్పడానికి మూడేళ్ల క్రితం జరిగిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

Lavanya Tripathi

Bollywood Actress Shama Sikander Hot and Sexy Photo Gallery

‘కరుణామయుడు’ వెనక ఎంతపెద్ద ‘షో’ నడిచిందో?

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

ముఖ్య కథనాలు

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

నన్ను కెలకొద్దు.. జగన్‌ కోటరీకి విజయసాయి వార్నింగ్..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist