కిచ్చ సుదీప్ హీరోగా .. శివ కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యాక్షన్ మూవీ ‘కే 3 కోటికొక్కడు’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోన్న ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ కన్నడ. తెలుగులో గుడ్ సినిమాస్ వారు విడుదల చేస్తున్నారు. కోటిగొబ్బ 3 గా కన్నడలో విడుదల కాబోతున్న ఈ సినిమా లో మలయాళ కుట్టి మడోనా సెబాస్టియన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రద్ధా దాస్, రవిశంకర్, సన్నిలియోన్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా తెలుగు వెర్షన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను .. తెలుగు దర్శకులైన .. మారుతి, గోపీచంద్ మలినేని, బాబీ లు ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. కరెన్సీ కాగితాలు ఎగురుతూండగా.. సుదీప్ సిగరెట్ కాల్చుతూ పోస్టర్ మీద రివీలైన లుక్ ఆకట్టుకుంటోంది.
2016 లో విడుదలైన ‘కోటిగొబ్బ 2’ సినిమాకిది సీక్వెల్ గా రూపొందుతోంది. అప్పుడు ఈ సినిమా తెలుగులో ‘కోటికొక్కడు’గానూ, తమిళంలో ‘ముడింజ ఇవనపుడి’ గానూ విడుదలై.. మంచి సక్సెస్ సాధించింది. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ ని తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. త్వరలోనే విడుదల కాబోతున్న ‘కే3 కోటికొక్కడు’ సుదీప్ కు ఏ స్థాయిలో పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.
Must Read ;- సిక్స్ ప్యాక్ తమ్ముడితో రక్షిత ఫ్యామిలీ ప్యాక్ సినిమా
Happy to launch the first look of #K3Kotikokkadu 💰🔥
Wishing the Kannada 'Baadshah' @KicchaSudeep & the entire team, all the very best! 😊@ArjunJanyaMusic @MadonnaSebast14 @shraddhadas43 #ShivaKarthik #GoodCinemaGroup #K3telugu @shreyasgroup @anandaudioTolly pic.twitter.com/ftqSzWU5Vy
— Director Maruthi (@DirectorMaruthi) March 26, 2021











