గతంలో సామ్రాజ్యంలో మహారాజుకు సామంత రాజులు వెళ్లి వీళ్లకు కావాల్సింది మిగుల్చుకుని కప్పం కట్టి వచ్చేవాళ్లు. ఇప్పుడు అంతా రివర్స్… మొత్తం పైసలు పైకే వెళ్లిపోతున్నాయి. అన్నిటికీ ఢిల్లీకి వెళ్లి అడుక్కోవాల్సిందే. రాజకీయ సుడిగుండాలు ఎటు తిరిగితే అటే పైసలొచ్చే రోజులొచ్చాయి. అంతా వన్ సైడ్ అయిపోయింది. అందుకే వెళ్లినోళ్లు కూడా వన్ సైడ్ సమాచారం మన మొహాన పడేస్తున్నారు… అసలు సంగతులు మాట్లాడుకున్నోళ్లకు తప్ప ఎవరికీ తెలియని పరిస్దితి ఏర్పడింది. సీఎంలు ఎవరెళ్లినా పరిస్థితి అదే.. ఏదో కేజ్రీవాల్, మమతాబెనర్జీ లాంటి వాళ్లు తప్ప..నిజాలు ఎవరూ బయటకి చెప్పరు. ఇప్పుడు జగన్ సార్ ఢిల్లీ వెళ్లారు. కేంద్ర మంత్రులను కలిసి వచ్చారు.
ఏ కేంద్ర మంత్రిని ఏమడిగారో..
ఏ కేంద్ర మంత్రిని ఏమడిగారో ఒక పెద్ద ప్రెస్ నోట్ రిలీజ్ టైమ్ టు టైమ్ రిలీజయ్యాయి. వాళ్లు కలిసి పూల బొకేలు ఇచ్చిపుచ్చుకునే టైమ్ తీసేస్తే.. ఆ ప్రెస్ నోట్‌లో ఉన్నవన్నీ చదివేసినంత టైమ్ కూడా వాళ్లు మాట్లాడుకోరు ఒక్కోసారి. అంత బారు ప్రెస్ నోట్లు వస్తాయి. ఇది కామన్ ప్రాక్టీస్ అయిపోయింది సీఎంల ఢిల్లీ పర్యటనలకు.
ఉదాహరణకు..
ఉదాహరణకు కేంద్ర జలవనరుల శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ని కలిసి.. పోలవరం ప్రాజెక్టు బడ్జెట్ విడుదల చేయాలని, రీయింబర్స్ మెంట్ కూడా చెల్లించాలని.. పోలవరం అథారిటీ కార్యాలయాన్ని రాజమహేంద్రవరానికి మార్చమని అడిగినట్లు న్యూస్ వచ్చింది. గజేంద్ర సింగ్ షెకావత్ మాత్రం ట్వీట్‌లో జలశక్తి ప్రాజెక్టుల గురించి మాట్లాడినట్లు, ప్రతి ఇంటికి తాగునీటి కనెక్షన్ ప్రాజెక్టు అప్ డేట్ గురించి మాట్లాడుకున్నట్లు ట్వీట్ చేశారు సింపుల్ గా. అదీ సంగతి.
Also Read ;- జగన్ ఢిల్లీ టూర్.. దేశ వ్యాప్తంగా రచ్చకెక్కిన రఘురామ ఎపిసోడ్
ఇక ధర్మేంద్ర ప్రదాన్‌ను కలిసినా.. పీయూష్ గోయెల్‌ని కలిసినా.. అన్నీ అవే సంగతులు. కాకపోతే కీలకమైనది ఏంటంటే మూడు రాజధానుల విషయంలో సహకరించాలని హోంమంత్రి అమిత్ షాను కోరారని.. అలాగే పెట్రో ప్రాజెక్టుకు సంబంధించి వయబులిటీ గ్యాప్ ఫండింగ్ పెట్టుకోలేమని సూటిగా జగన్ ధర్మేంద్ర ప్రదాన్‌కు చెప్పేశారని.. ఈ రెండూ మాత్రం జరిగినట్లు క్లారిటీగా తెలుస్తోంది.
వెళ్లిన ప్రతిసారీ ప్రత్యేక హోదా అడిగినట్లు..
వెళ్లిన ప్రతిసారీ ప్రత్యేక హోదా అడిగినట్లు.. స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు ప్రయివేటీకరించొద్దని అడిగినట్లు.. ఇంకా చాలా అడిగినట్లు పెద్ద లిస్టు రిలీజ్ చేస్తారు.ఇవన్నీ అడుగుతారో లేదో తెలియదు..కనీసం అడిగిన దానికి వారేం బదులిచ్చారో కూడా చెప్పరు. అటు కేంద్ర ప్రభుత్వం గాని, మంత్రులు గాని.. ఏం మాట్లాడుకున్నారో స్పష్టంగా బయటికి చెప్పరు. అన్నీ దాగుడుమూతలే.
పైకి మాత్రం..
ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కూడా అలాగే ఉంది. లోపల మాట్లాడుకునేది రాజకీయ సంబంధాల గురించి.. అకడమిక్ లేదా ఎకనమిక్ విషయాలన్నీ రాతపూర్వకంగా సమర్పిస్తారు.. అలాగే కేంద్ర, రాష్ట్ర అధికారుల మధ్య ముందే సంప్రదింపులు జరుగుతాయి. వీరు కలుసుకున్నప్పుడు కేవలం వీరికున్న రాజకీయ చిక్కు సమస్యలు..వాటికి కేంద్రం అందించాల్సిన సహకారం గురించి మాత్రమే చర్చిస్తారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అంతే కాదు.. కేంద్రం సైతం.. రాష్టం నుంచి వారికి కావాల్సిన రాజకీయ మద్దతు గురించి మాత్రమే ప్రస్తావిస్తుందని అంటున్నారు. పైకి మాత్రం బోలెడంత.. కావాల్సినంత కలరింగ్ మాత్రం ఇవ్వాల్సినంత ఇచ్చేస్తారు.
Must Read ;- 90 నిమిషాల భేటీ.. మూడు రాజధానులు,బకాయిలు ఇప్పించాలంటూ











