TDP Leader Nara Lokesh Pics Viral :
మీరు సాహో సినిమా చూశారా.. ఆ సినిమాలో హీరో వెంట కొంతమంది పరుగుడెతూ తరుముతుంటారు. అప్పుడు హీరోయిన్ ‘అసలు ఎవరు వీళ్లు… మీ ఫ్యాన్స్ అని అడుగుతుంది. ‘ఫ్యాన్స్ కాదు.. డై హార్డ్ ఫ్యాన్స్’ అని బదులిస్తాడు హీరో. కానీ అందతా సినిమా వరకు. కానీ రియల్ లైఫ్ లో ఇలాంటి డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారా? అంటే.. ఇదిగో జ్యోతివంశీ లాంటివాళ్లను ఉదాహరణగా చూపించవచ్చు.
ఏపీకి చెందిన జ్యోతివంశీ టీడీపీ కార్యకర్త. పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నా.. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నా ఎంతో ఇష్టం. టీడీపీపై ఇష్టంతో కార్యకర్తగా మారాడు. పార్టీ ఏ చిన్నా కార్యక్రమానికి పిలుపు ఇచ్చినా చురుగ్గా పాల్గొంటాడు. ఎన్నికల్లో టీడీపీ నాయకులు తరపున ప్రచారం చేస్తూ కార్యకర్తగా తన బాధ్యతను నిర్వహిస్తుంటాడు. చంద్రబాబు ఆదర్శ భావాలు, నారా లోకేశ్ పోరాట పటిమ నచ్చడంతో టీడీపీకి వీరాభిమానిగా మారాడు. నారా లోకేశ్ మీద అభిమానంతో తన చేతిపై పచ్చబొట్టు సైతం వేయించుకున్నాడు. అంతేకాదు.. ‘నా ప్రాణం దేశమైతే.. నా ఊపిరి తెలుగుదేశం’ అనే అద్భుతమైన కొటేషన్ తన కారుపై కూడా రాయించుకున్నాడు. జ్యోతివంశీ చేతిపై లోకేశ్ పచ్చబొట్టు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. టీడీపీ నాయకులనే కాదు.. నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ‘‘కార్యకర్త అంటే నువ్వే బాసూ.. ముఖ్యమంత్రులకు కూడా ఇలాంటి ఫ్యాన్స్ ఉండరేమో’’ అని కామెంట్లు చేస్తున్నారు.
Must Read ;- ‘పుట్టుక నాది, చావు నాది, బతుకంతా టీడీపీదే’ : పింఛన్ తో పార్టీ గుర్తులు, ఎన్టీఆర్ బొమ్మల తయారీ!