రంగా జయంతి నాడు రాధా సంచలన కామెంట్స్..!
మహానేత వంగవీటి రంగా జయంతిని పురష్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ప్రజలు ఘన నివాళి అర్పించారు. ఈ నేపథ్యంలో కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం చినగొన్నూరులో జరిగిన జయంతి కార్యక్రమాల్లో వంగవీటి రాధా, మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీలు ఒకే వేదికను పంచుకున్నారు. అలా ఒకే వేదికపై మిత్రులు కనిపించడం ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో రాధా సంచలన కామెంట్స్ చేశారు. తనను ఏదో చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని అలా చెయ్యాలనే వారికే చెబుతున్నానని ప్రసంగాన్ని ప్రారంభించారు. నన్ను ఎవరూ ఏమీ చేయలేరని, ఎవరకీ భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. ఎన్ని కుట్రలు చేసిన రంగా తనయుడిగానే జనంలో ఉంటానని చెప్పారు. తనను పొట్టపెట్టుకునేందుకు రెక్కీ నిర్వహించారని, తనకు హాని చేయాలని చూసే వ్యక్తులెవరు అనేది త్వరలోనే చెబుతానని కొడాలి నాని, వల్లభనేని వంశీ ఎదుటే కుండబద్దలు కొట్టాడు. తాను దేనికైనా సిద్ధంగా ఉన్నానని, రంగా ఆశయ సాధనే తన లక్ష్యమని చెప్పారు.
కంగుతిన్న కొడాలి, వంశీ ..!
మంత్రి కొడాలి, వల్లభనేని వంశీ, రాధాలు ముగ్గురు ఎప్పడినుంచో మంచి మిత్రులు! ఆదివారం రంగా జయంతి సందర్భంగా ఒకే కారులో వచ్చి .. ఒకే వేదికపై దివంగత వంగవీటి రంగాకు నివాళులర్పించారు. వంశీ, కొడాలి వరుసగా ప్రసంగించారు. రాధా తనకు తమ్ముడు లాంటి వాడని, 24 క్యారెట్ల గోల్డ్ అని కొడాలి చెప్పుకొచ్చారు. అనంతరం రాధా ప్రసంగిస్తూ .. తనను చంపేందుకు రెక్కీ నిర్వహిస్తున్నారని, రంగా ఆశయాల కోసం తన ప్రాణం ఉన్నంతకు వరకు పోరాడుతునే ఉంటానని సంచలన కామెంట్స్ చేశారు. దీంతో వేదికపై ఉన్న వంశీ, కొడాలి కంగుతిన్నారు. ఎంతో నిశితంగా రాధా ప్రసంగాన్ని కన్నార్పకుండా చూస్తూ.. అసాంతం శ్రద్ధగా విన్నారు. ప్రస్తుతం రాధా చేసిన హాట్ కామెంట్స్.. ఇప్పుడు రాజకీయంగా వైరల్ అయ్యాయి. టీడీపీలో కొనసాగుతున్న రాధాను చంపేందుకు ఎవరు కుట్ర పన్నుతున్నారు? అంత అవసరం ఎందుకు వచ్చింది? అసలు ఎవరు స్కేచ్ వేస్తున్నారు? రెక్కీ నిర్వహించింది ఎవరి అనుచరులు? అన్న అంశాలే.. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది! అయితే ఇదే అంశంపై రాధా కూడా చాలా ఘాటుగా స్పందిచాడనే చెప్పవచ్చు!
Must Read ;- చంపేస్తాం నా కొడకా .. గుప్తాపై మంత్రి బాలినేని అనుచరుల దాడి ..!











