అధికారపార్టీతో టీడీపీ ఢీ అంటే ఢీ..!
అమరావతిలో అధికారపార్టీ ఆగడాలను ఇక సహించేది లేదంటూ పెదకూరపాడు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు నినదించాయి. అధికారపార్టీ ఇసుక దందాను ఎండగట్టేందుకు బహిరంగ చర్చకు సవాలు విసిరింది టీడీపీ. ఇసుక అక్రమ రవాణాను వ్యతిరేకిస్తూ.. టీడీపీ నేతలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఇరుపార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలు మధ్య ఆదివారం అమరావతి దద్దరిల్లింది. మండల పరిథిలోని లేమల్లే లో బహిరంగ చర్చకు వైసీపీ సవాలు విసరగా.. సవాలను స్వీకరించిన టీడీపీ చర్చకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చర్చకు టీడీపీ నేతలు బయలు దేరుతుండగా మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, టీడీపీ నేతలు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
ఖాకీల కౌర్యం.. టీడీపీ నేతలపై లాఠిఛార్జీ..!
గుంటూరు జిల్లా పెదకూరపాడు లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వైకాపా ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ప్రజలకి సుపరిపాలన అందించడంలో విఫలమైందని ఇటీవల ఒక సభలో ప్రభుత్వాన్ని ఉద్దేశించి తెదేపా నేత మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఆరోపించారు. మరోవైపు వైసీపీ నేతలు కూడా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి మండలంలోని లేమల్లే గ్రామంలో అక్రమ మట్టి తవ్వకాలు జరిగాయని ఆరోపించారు. దమ్ముంటే వాటిపై టీడీపీ చర్చకు రావాలని సవాల్ విసిరారు. వైసీపీ సవాలును స్వీకరించి టీడీపీ.. లేమల్లే గ్రామానికి బయల్దేరారు తెదేపా శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు చర్యలను నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు తెదేపా నాయకులు. ఈ క్రమంలో అమరావతి పోలీసులు టీడీపీ శ్రేణులపై లాఠిఛార్జీ చేశారు. బలవంతంగా వాహనంలో ఎక్కించుకుని పోలీసు స్టేషన్ తరలించారు. ఇరు పార్టీల పరస్పర సవాళ్లతో స్ధానికంగా ఉద్రిక్తత పరిస్థితిలు నెలకున్నాయి.
అక్రమ ఇసుక దందాపై కదంతొక్కిన టీడీపీ! ఖాకీల క్రౌర్యం.. టీడీపీ నేతలపై లాఠిచార్జీ!!